Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పటి శృంగార తార షకీలా గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా జీవిస్తున్న విషయం తెల్సిందే. దాదాపుగా షకీలా గురించి అంతా మర్చి పోతున్న సమయంలో ‘శీలవతి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాను అంటూ ప్రకటించింది. గత ఆరు నెలలుగా ఈ సినిమా గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదలకు రంగం సిద్దం అయ్యింది. తెలుగు సెన్సార్ బోర్డు ముందుకు ఈ సినిమా సెన్సార్ కోసం వెళ్లింది. సినిమాను చూడకుండానే చిత్ర యూనిట్ సభ్యులు టైటిల్ మార్చాల్సిందే అంటూ ఆదేశించారు. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను చూడకుండా టైటిల్ మార్చాల్సిందే అంటూ చెప్పడంను తప్పుబడుతున్నారు.
సినిమా సెన్సార్ చేయాలంటే టైటిల్ మార్చాల్సిందే అంటూ సెన్సార్ బోర్డు చెబుతున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. దాదాపు కోటి రూపాయల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. సెన్సార్ కార్యక్రమాల కోసం టైటిల్ను ఇప్పుడు మార్చితే ప్రేక్షకులు సినిమా గురించి పట్టించుకోరు అని, శీలవతి అనే టైటిల్ కథకు బాగా యాప్ట్ అనే ఉద్దేశ్యంతో ఆ టైటిల్ను పెట్టామని, సినిమా చూశాక టైటిల్ మార్చమని చెబితే అప్పుడు ఆలోచిస్తామని నిర్మాతలు అంటున్నారు. కథానుసారంగా టైటిల్ ఉండాలి తప్ప, సెన్సార్ వారికి ఇష్టం వచ్చినట్లుగా టైటిల్ ఉండవద్దని ఈ సందర్బంగా సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సెన్సార్ బోర్డు వారి నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలంటూ సెన్సార్ బోర్డు దరఖాస్తు చేయడం జరిగింది. మరి సెన్సార్ బోర్డు ఈసారి ఎలా స్పందిస్తుందో చూడాలి.