Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హీరోలంటే…అన్నీ పాజిటివ్ లక్షణాలతోనే ఉండేవాడు అనే భావన క్రమంగా తొలగించేస్తున్నారు మన డైరెక్టర్లు…హీరోకు ఏదో ఓ లోపం పెట్టి దాన్నే హైలెట్ గా చేసి సినిమాను నడిపించేస్తున్నారు. దీనివల్ల హీరోను ఏదో అసాధారణ శక్తిగా ఊహించేసుకోకుండా..మామూలు మనిషిగానే ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ కోణంలో భలే భలే మగాడివోయ్ అంటూ ఓ సినిమా చేసి ఘన విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ మారుతి. భలే భలే మగాడివోయ్ సినిమా నాని ఖాతాలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేయటమే కాక…బూతు డైలాగుల డైరెక్టర్ గా అప్పటిదాకా మారుతి కి ఉన్న చెడ్డ పేరును కూడా తొలగించి వేసింది. ఈ ఫార్ములా వర్కవుట్ కావటంతో మారుతి మరోసారి దాన్నే నమ్ముకున్నాడు.
హీరో శర్వానంద్ కూడా మారుతి ఫార్ములాకు ఓటేశాడు. వారిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మహానుభావుడు లో హీరోకు చాలా పెద్ద లోపమే ఉంది. అది అలాంటి ఇలాంటి లోపం కాదు…ఓ డిజార్డర్..దాని పేరు ఓసీడీ. అంటే అతిశుభ్రం అన్నమాట. మహానుభావుడులో శర్వానంద్ ఈ అతిశుభ్ర వ్యాధితో బాధపడుతుంటాడు. వినాయక చవితి సందర్భంగా విడుదలయిన మహానుభావుడు ఫస్ట్ లుక్, టీజర్ లో శర్వానంద్ శుభ్రత ఏ స్థాయిలో ఉంటుందో మచ్చుకు రెండు ఉదాహరణలు చూపించారు. ఏదో చెప్పబోతూ బాస్ తుమ్ముతుంటే..శర్వానంద్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన సీటులో కూర్చుంటాడు. ఈ శుభ్రత ఇంతటితో ఆగలేదు. ఆఖరికి హీరోయిన్ ను ముద్దు పెట్టుకోవాలన్నా…ఆమెను బ్రష్ చేశావా అని అడుగుతాడు. నువ్వు మహానుభావుడవేరా..అని బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తుంటుంది. ఇదన్నమాట.
మహానుభావుడు వెనక ఉన్న కథ. సాఫ్ట్ వేర్ గెటప్ లో శర్వానంద్ బుద్ధిమంతుడిలా కనిపిస్తున్న సినిమా ఫస్ట్ లుక్, టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రేక్షకులకే కాదు…ఈ టీజర్ హీరోలు ప్రభాస్, నానికి కూడా తెగ నచ్చేశాయి. టీజర్ ఎంతో సరదాగా, ఆసక్తికరంగా ఉందని ప్రభాస్ ఫేస్ బుక్ లో కామెంట్ చేశాడు. వీడెవడో లక్కీకి కజిన్ లా ఉన్నాడని నాని ట్విట్టర్ లో సరదాగా వ్యాఖ్యానించాడు. లక్కీ అంటే…భలే భలే మగాడివోయ్ లో నాని పోషించిన క్యారెక్టర్ పేరు. మొత్తానికి దసరా కానుకగా వస్తున్న మహానుభావుడు…టీజర్ తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడన్నమాట.
మరిన్ని వార్తలు: