కుర్ర హీరో శర్వానంద్ మంచి స్పీడుమీదున్నాడు. త్వరలో రణరంగం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న శర్వా.. 96 తమిళ రీమేక్‌లోను నటిస్తున్నాడు. ఇక తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. తన 29వ చిత్రాన్ని కిశోర్ రెడ్డి దర్శకత్వంలో చేయనుండగా,ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్‌నిచ్చారు. శశికాంత్ వల్లూరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బుర్రా సాయిమాధవ్ స్క్రిప్ట్ అందించారు. రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించనున్నారు. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకారం అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా ఎవరిని ఎంపిక చేస్తారనేది తెలియాల్సి ఉంది. కాగా, 96 తెలుగు రీమేక్ కోసం థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న శర్వానంద్ అనుకోకుండా ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో శర్వానంద్ షోల్డర్ డిస్ లొకేట్ అయింది. కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. కొద్ది రోజుల పాటు సన్‌షైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శర్వా రీసెంట్గా డిశ్చార్జ్ అయ్యారు . ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.