Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను దక్కించుకున్న శర్వానంద్ విభిన్న చిత్రాలను చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ వెళ్తున్నాడు. సక్సెస్ లేని దర్శకులను, విభిన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకులను పట్టుకోవడం శర్వానంద్‌కు మహా ఇష్టం. అందుకే తాజాగా ‘దండుపాళ్యం’ దర్శకుడు శ్రీనివాసరాజు దర్శకత్వంలో సినిమా చేసేందుకు శర్వానంద్ నిర్ణయించుకున్నాడు. కన్నడంలో ‘దండుపాళ్యం’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు పార్ట్లు కూడా భారీ విజయాలను దక్కించుకున్నాయి. దాంతో దర్శకుడు శ్రీనివాసరాజుకు మంచి పేరు వచ్చింది.
తెలుగులో కూడా ‘దండుపాళ్యం’ రెండు పార్ట్‌లకు మంచి ఆధరణ లభించింది. శ్రీనివాసరాజుకు తెలుగు సినీ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కాయి. మొత్తానికి దండుపాళ్యం సక్సెస్‌తో శ్రీనివాసరాజుకు శర్వానంద్‌తో సినిమా చేసే అవకాశం దక్కింది. ఇటీవలే శర్వానంద్ కోసం కథను వినిపించడం, ఆ కథకు శర్వానంద్ ఓకే చెప్పడం జరిగి పోయింది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని శర్వానంద్ చేస్తున్నాడు. ఆ రెండు చిత్రాలు వచ్చే సంవత్సరం ప్రథమార్థంకు పూర్తి కానున్నాయి. ఆ చిత్రాల తర్వాత శర్వానంద్, శ్రీనివాసరాజుల కాంబో మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. దండుపాళ్యం వంటి చిత్రాన్ని శర్వానంద్‌తో తీస్తాడా లేదా మరేదైనా నేపథ్యంలో చిత్రాన్ని చేస్తాడో చూడాలి.