బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌కు సిడ్నీలో అవమానం

Shilpa-Shetty-Alleges-Racis

అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లో ఇంకా జాతి వివక్ష ఎక్కువగా ఉంది అనే విషయం తెల్సిందే. ఎంతో అభివృద్ది చెందినా కూడా ఆ దేశాలు ఇంకా జాతి వివక్షలో కొట్టుకు చస్తున్నాయి అనే విమర్శలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నా కూడా వారు మాత్రం తమ పద్దతిని మార్చుకోవడం లేదు. తాజాగా మన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శిల్పా శెట్టిని ఆస్ట్రేలియా విమానాశ్రయ సిబ్బంది తీవ్రంగా అవమానించడం జరిగింది. కేవలం చర్మం రంగును చూసి వారు నన్ను అవమానించారు అంటూ శిల్పా శెట్టి ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఖచ్చితంగా జాతి వివక్ష చర్య అంటూ అంతా అంటున్నారు.

Shilpa Shetty Alleges

 

అసలు విషయం ఏంటీ అంటే నిన్న ఆదివారం నాడు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుండి మెల్‌బోర్న్‌కు విమానంలో ప్రయాణించేందుకు సిడ్నీ ఎయిర్‌ పోర్ట్‌కు శిల్ప చేరుకుంది. అక్కడ చెక్‌ఇన్‌ సమయంలో విమానాశ్రయ సిబ్బంది చాలా ఇబ్బంది పెట్టారట. తన వద్ద ఉన్న రెండు బ్యాగ్‌లలో ఒక బ్యాగ్‌ మోతాదుకు మించి బరువు ఉంది అంటూ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారట. ఆ బ్యాగ్‌ చెకింగ్‌ విషయంలో పలు అభ్యంతరాలు పెట్టడంతో పాటు, పలు సార్లు తనను ఇబ్బంది పెడుతూ ప్రశ్నలు వేశారు.. చాలా సమయం వెయిటింగ్‌ చేయించారు అంటూ శిల్ప ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం తన కలర్‌ కారణంగానే మర్యాద దక్కలేదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. వెంటనే సిడ్నీ విమానాశ్రయ సిబ్బంది శిల్పకు క్షమాపణలు చెప్పాలిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.