Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్టీలో అంతర్గతంగా చెలరేగుతున్న అసమ్మతి తో పాటు nda మిత్రపక్షాల ని దువ్వడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పది మెట్లు కిందకు దిగుతున్నారు. అయినా నిన్నటి దాకా మోడీ , అమిత్ షా వల్ల పరాభవాలు పొందిన వాళ్ళ మనస్సులో ఇంకా ప్రతీకార జ్వాలలు రగులుతూనే వున్నాయి. అందుకు తగ్గట్టే అమిత్ షా కి అనుభవాలు ఎదురు అవుతున్నాయి. శివసేనని ఎలాగైనా బుజ్జగిద్దామని అమిత్ షా డిసైడ్ అయ్యారు. అందుకే మూడు రోజుల పాటు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వేధించినా సిగ్గు విడిచి ఈ సాయంత్రం శివసేన అధినేత ఉద్ధవ్ తో సమావేశానికి అమిత్ షా గ్రీన్ సిగ్నల్ పొందారు.
మరికొన్ని గంటల్లో ఉద్ధవ్ ని కలవడానికి అమిత్ షా వస్తున్న సందర్భంలో శివసేన అధికారిక పత్రిక “సామ్నా “ తాజా సంచిక బయటకు వచ్చింది. అందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు ప్రధాని మోడీని తీవ్ర స్థాయిలో ఏకిపడేసింది. సంపర్క్ అభియాన్ పేరిట అమిత్ షా పలువురు ప్రముఖుల్ని కలవడాన్ని కూడా శివసేన తప్పుబట్టింది. బీజేపీ కి జనంతో సంబంధం ఎప్పుడో తెగిపోయిందని , మోడీ విదేశాల్లో , అమిత్ షా దేశంలో తిరిగి ప్రచారం చేసినా ఇక ప్రయోజనం లేదని తేల్చి చెప్పింది. సామ్నా ఇంత సూటిగా చెప్పాక కూడా అమిత్ షా శివసేన అధినేత ఉద్ధవ్ ని కలుస్తారా అన్నది చూడాలి. ఒకవేళ కలిసినా ముఖాముఖీ సమావేశంలో ఉద్ధవ్ ఇదే స్థాయిలో విరుచుకుపడితే అమిత్ షా సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అయినా అవసరాల ముందు సిగ్గు లాంటి చిన్న చిన్న విషయాలను అమిత్ షా లాంటి పెద్ద పెద్ద నాయకులు పట్టించుకోరేమో. ఏదేమైనా బీజేపీ అగ్రద్వయానికి nda మిత్రపక్షాలు అదను చూసి చుక్కలు చూపిస్తున్నాయి.