విడుదల తేదీ : ఆగస్టు 01, 2024
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2/5
నటీనటులు: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు.
దర్శకులు: అప్సర్
నిర్మాతలు : మహేశ్వర్ రెడ్డి మూలి
సంగీత దర్శకుడు: వికాస్ బడిస
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
ఎడిటర్ : ఛోటా కె. ప్రసాద్
అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో అప్సర్ డైరెక్ట్ చేసిన మూవీ ‘శివం భజే’. ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ :
చందు (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఎజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకుని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేస్తుంటారు . ఈ క్రమంలో శైలజ(దిగంగనా సూర్యవంశీ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఒక కెమికల్ ల్యాబ్‌లో జాబ్ చేస్తుంటుంది. అయితే, ఒక గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఒక నాటకీయ సంఘటన కారణంగా చందు కళ్లకి ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరవి..? చందుకు కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి..? శివుడి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి..? ఈ మధ్యలో డోగ్రా (కుక్క) పాత్ర ఏమిటి..? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
డివోషనల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సాగిన ఈ మిస్టీరియస్ థ్రిల్లర్‌లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందని విధంగా ఉన్నది . దర్శకుడు రాసుకున్న క్రైమ్ డ్రామా కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ముఖ్యంగా మూవీ లో కొన్ని సస్పెన్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. చందు పాత్రలో అశ్విన్ బాబు చాలా బాగా నటించారు . హీరోయిన్ పాత్రలో దిగంగనా సూర్యవంశీ బాగానే నటించింది. సీరియస్ పోలీస్ అధికారిగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ఆకట్టుకున్నారు.
అదేవిధంగా హైపర్ ఆది పంచ్‌లు అండ్ మేనరిజమ్స్ కూడా బాగున్నాయి. బ్రహ్మాజీ తన పాత్రలో మెప్పించాడు. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించిన సాయి ధీన, మురళీ శర్మ, తులసి తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అప్సర్ తీసుకున్న మెయిన్ పాయింట్, అండ్ ఆ పాయింట్‌ని ఎలివేట్ చేస్తూ రాసుకున్న కొన్ని సీన్స్ పర్వాలేదు. అలాగే శత్రుదేశాల దాడి నేపథ్యంలో అల్లిన డ్రామా కూడా బాగానే ఉన్నది .
మైనస్ పాయింట్స్:
ఈ ‘శివం భజే’ మూవీ లో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా, కొన్ని చోట్ల ప్లే చాలా సింపుల్‌గా సాగుతుంది. అలాగే డివోషనల్ పాయింట్ అండ్ కంటెంట్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ కూడా సింపుల్‌గానే సాగింది. అటు హత్యలకి సంబంధించిన ట్రాక్ కూడా బాగాలేదు. ఈ ట్రాక్‌కి మోటివ్ ఇంకా బలంగా ఉండాల్సింది. మొత్తానికి మేకర్స్ తాము అనుకున్న కంటెంట్‌ని స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా, కొన్ని సీన్స్ ఆకట్టుకోలేకపోయాయి.
‘శివం భజే’ ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకోవు. పైగా హీరో అశ్విన్ బాబు క్యారెక్టర్ కూడా బలహీనంగా సాగుతోంది . ఆ పాత్రకు కొత్త కళ్ళు వచ్చాక, ఆ పాత్రలోని పెయిన్ ఆశించిన స్థాయిలో ఎలివేట్ కాలేదు. దీనికితోడు మూవీ లో నాటకీయత ఎక్కువవడంతో సహజత్వం లోపించింది. ఇక మొదటి భాగంలో అశ్విన్ బాబు – హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ మధ్య సాగిన ప్రేమ సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోతాయి.
సాంకేతిక విభాగం :
దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌కి గుడ్ ట్రీట్మెంట్‌ని యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్‌గా రాసుకొని ఉండాల్సింది. మూవీ లో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలని కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ బడిస సంగీతం పర్వాలేదు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
తీర్పు :
డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే, కథాకథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో మూవీ ని నింపడం వంటి అంశాలు మూవీ కి మైనస్‌గా నిలిచాయి. ఓవరాల్‌గా ఈ మూవీ ప్రేక్షకులకి అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు.