Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అలామొదలైంది అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నిత్యామీనన్ చాలా అరుదుగా మాత్రమే సినిమాలు చేస్తూ ఉంది. తనకు నచ్చిన పాత్ర అయితేనే సినిమాకు కమిట్ అవుతాను అంటూ చెబుతూ ఎక్కువ ఆఫర్లను పోగొట్టుకుంది. గ్లామర్ పాత్రలకు నో చెబుతూ వస్తున్న ఈ అమ్మడు తాజాగా నాని నిర్మించిన ‘అ!’ చిత్రంలో ఒక విభిన్నమైన పాత్రలో నటించింది. ఆ సినిమాలో నిత్యామీనన్ పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. అయితే పొట్టిగా ఉండే నిత్యామీనన్ ఈ మద్య లావు ఎక్కువ అవ్వడంతో తన అందం కోల్పోతుందని కొందరు అంటున్నారు. ఉన్నట్లుండి నిత్యామీనన్ ఎందుకు ఇంతలా లావు పెరుగుతుందా అని ఆరా తీయగా ఒక షాకింగ్ విషయం వెళ్లడైంది.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నిత్యామీనన్ గత కొంత కాలంగా బీర్‌లు ఎక్కువ తాగుతుందని, ఆ కారణంగానే విపరీతమైన బరువు పెరిగింది అంటున్నారు. నిత్యామీనన్ బరువు పెరగడం వెనుక ఇలాంటి కారణం ఉందని తెలిసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. మొదటి నుండి కూడా బీర్ అలవాటు ఉన్న ఈ అమ్మడు ఈ మద్య మరీ ఎక్కువగా తీసుకుంటుందని, అందుకే ఇలా లావు ఎక్కువ అయ్యిందని అంటున్నారు.
నిత్యామీనన్ ఇకపై అయినా తన బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, జాగ్రత్త పాటించాలని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కాని నిత్యామీనన్ మాత్రం తనకు నచ్చినట్లుగా చేయడం, తాను అనుకున్నట్లుగా జీవించాలని కోరుకుంటుంది. అందుకే నిత్యామీనన్ బరువు తగ్గడం అనేది కష్టమే కావచ్చు. నిత్యామీనన్ కెరీర్ కూడా చివరి దశకు చేరుకున్నట్లే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.