Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లరి నరేష్ హీరోగా చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ శ్రద్దా దాస్. ఆ చిత్రం తర్వాత పలు ఈమెకు పలు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కాని ఏ ఒక్క సినిమా కూడా ఈమెకు సక్సెస్‌ను తెచ్చి పెట్టలేక పోయింది. అయినా అడపా దడపా చిత్రాల్లో కనిపిస్తూ ఉన్న అమ్మడు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవకాశా కోసం తాను దిగజారకపోవడం వల్లే తనకు అవకాశాలు రాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
గత కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ విషయమై చర్చ జరుగుతుంది. అదే విషయాన్ని శ్రద్దాదాస్ కూడా చెప్పుకొచ్చింది. తనకు అవకాశాలు వచ్చాయి కాని, దర్శకుడు లేదా హీరో లేదంటే నిర్మాత కోరిక తీర్చాల్చి వచ్చింది. కాని నా మనస్సు అందుకు అంగీకరించలేదు. ఆఫర్ల కోసం తాను ఎప్పుడు కూడా దిగజారలేదు. ఇప్పటికి కూడా అవకాశాలు ఇస్తాను అంటే దిగజారాల్సిన అవసరం నాకు లేదు. వచ్చిన ఛాన్స్‌ను చేస్తాను, లేదంటే ఊరికే ఉంటాను. సినిమాల కోసం వ్యక్తిత్వంను చంపుకుని, వారికి లొంగను అంటూ పేర్కొంది. ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్స్ దిగజారి, వ్యక్తిత్వంను పక్కన పెట్టడం వల్లే ఇప్పుడు వారు స్టార్ హీరోయిన్స్‌గా వెలుగు వెలుగుతున్నట్లుగా శ్రద్దా దాస్ చెప్పుకొచ్చింది. ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరు అనేది మాత్రం ఆమె చెప్పేందుకు నిరాకరించింది.
మరిన్ని వార్తలు: