కానిస్టేబుల్ భార్యతో ఏకాంతంగా ఎస్సై…పట్టిచ్చిన సిగరెట్ !

SI Kiran illegal affair with constable wife

వివాహేతర సంబంధాలు ఒక పక్క ప్రాణాలు తీస్తొంటే మరో పక్క పరువు తీస్తున్నాయి. బెంగళూరులో ఇటీవలే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భార్యతో రూరల్ ఎస్పీ భీమశంకర్ సాగించిన అక్రమ సంబంధం బట్ట బయలు కావడంతో కర్ణాటక పోలీస్ శాఖ పరువు గంగలో కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన ఇంకా మరువకముందే అదే కర్ణాటకలో తనకింద పనిచేసే కానిస్టేబుల్ భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఓ ఎస్ఐ.. గత కొద్దిరోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ వివాహేతర బంధాన్ని ఓ ప్రమాదం రట్టు చేసింది.

బళ్లారి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వైర్‌లెస్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ కిరణ్.. నగరంలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు.. అదే క్వార్టర్స్‌లో ఉంటున్న బళ్లారి తాలుకాలోని పరమదేవనహళ్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత బుధవారం తన గదిలో వీరిద్దరూ కలిసి ఉండగా. కిరణ్ ఫుల్లుగా తాగి ఉన్నాడు. మద్యం మత్తులో సిగరెట్ కిందపడేయగా గాలికి నిప్పురవ్వలు సోఫాసెట్‌ మీద పడి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అది ఇంటి మొత్తానికి వ్యాపించింది.. పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో వారు ప్రాణభయంతో బయటకు పరిగెత్తుకుంటూ వచ్చరు. ఆ సమయంలో వారిద్దరూ అర్థనగ్నంగా ఉండటంతో చుట్టుపక్కల వారికి అక్రమ సంబంధం గురించి తెలిసింది. వీరిద్దరిపై కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.