Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక ఎన్నికలు మరింత దగ్గరకి రావడంతో అక్కడి రాజకీయ నాయకులు ప్రచారంలో తమ స్పీడ్ పెంచారు. ఒక పక్క మోడీ-షా మరో పక్క రాహుల్ ఇలా అన్ని పార్టీల అధినాయకత్వాలు రోడ్డెక్కి మరీ ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇప్పటి దాకా పాలనలో తనదయిన ముద్ర వేసుకోలేకపోయిన సిద్దరామయ్య, మోడీ పుణ్యమా అని ఇప్పుడు కన్నడ ప్రజల నోళ్ళలో నానుతున్నారు. దానికి కారణం ఆయన మోడీ మీద చేస్తున్న ట్విట్టర్ దాడి అనే చెప్పాలి. నిజానికి 20 ఎన్నికల్లో మోడీ సోషల్ మీడియా ప్రభావం వల్లే అందరి దృష్టిలో పడ్డాడని ఒప్పుకోక తప్పదు. అలాంటి మోడీ ని ఇప్పుడు సిద్ద రామయ్య అదే సోషల్ మీడియా సాయంతో నిలేస్తుండడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. మోడీ మీద కాని ఆ పార్టీ నాయకుల మీద కానీ ఎటువంటి అసభ్య, అనుచిత వ్యాఖ్యలు చేయకుండానే మోడీ వ్యాఖ్యలకు వెంట వెంటనే లాజికల్ గా మరలా మోడీ మాట్లాడలేని విధంగా గట్టి సమాధానాలు ఇస్తున్నారు.
తడుముకోకుండా రాహుల్ 15 నిముషాల పాటు మాట్లాడాలని సవాల్ విసిరిన మోడీకి, మీ యద్యురప్ప సర్కారు చేసిన అభివృద్ధి గురించి 15 నిముషాలు మాట్లాడగలరా అంటూ కౌంటర్ ఇచ్చారు సిద్దరామయ్య. ఇలా ఒకటనే కాదు అన్ని ట్వీట్లకి సిద్దు కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ – పుదుచ్చేరి – పరివార్ – పీపీపీ పార్టీ అంటూ కాంగ్రెస్ మీద వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టిన సిద్దరామయ్య… బీజేపీని ప్రిజన్ – ప్రైస్ రైజ్ – పకోడీ (జైలు – ధరల పెంపు – పకోడీ) పార్టీ (పీపీపీ)గా అని ట్విట్టర్ లో అభివర్ణించారు. అదీ కాక ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా మర్యాదగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంటే బీజేపీ అభ్యర్దులు మాత్రం రోజుకొక వివాదాస్పద వ్యాఖ్యలతో మోడీకి నిద్ర లేకుండా చేస్తున్నారు.
నిన్నటికి నిన్న `కార్యకర్తల్లారా… మనకు విశ్రాంతి లేదు. ఎవరైన ఓటర్లు ఓటు వేయడానికి నిరాకరిస్తూ పోలింగ్ బూత్‌కు రావడం లేదని మీ దృష్టికి వస్తే వారింటికి వెళ్లి – కాళ్లు – చేతులను కట్టేసి పోలింగ్ బూత్ కు తీసుకురండి. బీజేపీకి ఓటు వేయించండి“ అంటూ యడ్యూరప్ప వ్యాఖ్యానించడం బీజేపీ నాయకుల బరితెగింపు కనిపిస్తోందని ఇప్పుడే ఇలా ఉంటె పొరపాటున అధికారం వస్తే పరిస్థితి ఏమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎప్పుడు నిద్రమత్త్హులో ఉండే సిద్దరామయ్యని సులభంగా ఓడించచ్చు అనుకుంటున్నా బీజేపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయనే చెప్పాలి.