Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ వేదికగా కన్నడ రాజకీయం కొనసాగుతోంది. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ హోటళ్ళలో వున్న సంగతి తెలిసిందే. అయితే యడ్యూరప్ప బలపరీక్షకు రేపు సాయంత్రం 4 గంటల వరకూ సుప్రీంకోర్టు గడువునిచ్చింది. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భాగ్యనగరానికి రానున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రేపటి బలపరీక్షపై చర్చ తాజ్ కృష్ణ హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమాలోచనలు కొనసాగుతున్నాయి. నోవాటెల్ లో రేపు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు కొనసాగుతన్నాయి. ఈ క్రమంలో అక్కడి ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని ఈరోజు రాత్రికి బెంగుళూరుకు తెచ్చేందుకు ఆజాద్ తో కలిసి సిద్దరామయ్య బయల్దేరారు.
సిద్ద రామయ్య, ఆజాద్ లతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్ వచ్చేందుకు విమానాశ్రయానికి వెళ్లారు. అయితే అధికారులు వారు ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించారని తెలుస్తోంది. దీంతో ఆయన దాదాపు రెండు గంటలుగా బెంగళూరులోనే నిరీక్షిస్తున్నారు. అడుగడుగున కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు బీజేపీ ఆటంకాలు సృష్టిస్తోంద అర్ధం అవుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు జరుగుతున్నాయి. గత రాత్రి కూడా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎక్కాల్సిన విమానాలకూ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు బస్సుల్లో వచ్చారు.