పాన్ ఇండియా లెవెల్లో ‘సిల్క్ స్మిత’ బయోపిక్

పాన్ ఇండియా లెవెల్లో ‘సిల్క్ స్మిత’ బయోపిక్
Silk Smitha

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర గ్లామ్ సాంగ్స్ లో అయితే ఒక స్టాండర్డ్స్ ని సెట్ చేసి సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చిన నటి సిల్క్ స్మిత కోసం ప్రత్యేకంగా చెప్పాలిన పని లేదు. విజయలక్ష్మి వడ్లపాటిగా వెండితెరకు పరిచయం అయ్యిన తాను అక్కడ నుంచి సిల్క్ స్మితగా ఇండియన్ సినిమాని ఊపేసిన తాను తన ఆన్ స్క్రీన్ లైఫ్ కోసం చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ ఆమె విషయంలో తెలియని కోణం కోసం చాలా మందికి తెలియకపోవచ్చు.

పాన్ ఇండియా లెవెల్లో ‘సిల్క్ స్మిత’ బయోపిక్
Silk Smitha

మరి దానిని కూడా తెలిజేసే ప్రయత్నంగా దర్శకుడు జయరాం అలాగే నిర్మాత ఎస్ బి విజయ్ ల కలయికలో అయితే చేస్తూ ఉన్నారు . టైటిల్ కూడా “సిల్క్ స్మిత” అనే అనౌన్స్ చేసి పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమా లో సిల్క్ స్మిత పాత్రని రీసెంట్ గా నటసింహ బాలకృష్ణతో “వీరసింహా రెడ్డి” సినిమా లో స్పెషల్ సాంగ్ లో కనిపించిన నటి చంద్రిక రవి పోషిస్తుండగా ఆమెపై ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా ఇప్పుడు మేకర్స్ రివీల్ చేసేసారు . మరి ఇందులో ఆమె పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది అని చెప్పాలి. మరి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కి సిద్ధం కానున్నది .