రవితేజ విచారణలో కామెడీనే కామెడీ.

SIT interrogation to raviteja about on Drug case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసు విచారణకి సంబంధించి సినీ నటుడు రవితేజ సిట్ ముందు హాజరు అయిన విషయం తెలిసిందే. ఆయనకి, అధికారులకి మధ్య ఏమి జరిగి ఉంటుందన్న దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. అందులో నిజం ఎంతో రవితేజకి, విచారించిన అధికారికి మాత్రమే తెలియాలి. అయితే ఓ రవితేజ అభిమాని కామెడీగా ఆయన సినిమా పేర్లతో సిట్ విచారణ ఎపిసోడ్ ఎలా జరిగి ఉంటుందో రాసాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మేటర్ చదివితే మీరు కూడా పగలబడి నవ్వుతారు. అది మీ కోసం.

రవితేజ నేటి సిట్ ఇంటర్వ్యూ :


డ్రగ్స్ వాడితే ఏమొస్తుంది?
కిక్

పదే పదే ఎందుకు వాడతారు?
కిక్ (2)

డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తారు?
దుబాయి శీను, డాన్ శీను

ఎవరితోకలిసి డ్రగ్స్ తీసుకునేవారు?
వెంకీ,చంటి, భద్ర, భగీరధ,కృష్ణ,ఆంజనేయులు,వీరా

మీరు డ్రగ్స్ తో పాటు ఏమి తీసుకుంటారు?
మిరపకాయ్

మీకు డ్రగ్స్ ఎవరు అలవాటు చేశారు?
ఇడియట్

మీరు డ్రగ్స్ తీసుకుంటారని తెల్సి మీ వాళ్లు ఎలా ఫీలయ్యారు?
షాక్

ఈ ఫోటోలో ఉన్నవాడు ఎవడు?
విక్రమార్కుడు

ఇతను ఏం చేస్తుంటాడు?
దొంగోడు

మీ తమ్ముళ్లను చెడగొట్టింది?
వీడే

మీరు డ్రగ్స్ బదులు ఏమి ఇచ్చేవారు రూపాయలా డాలర్లా?
నా ఆటోగ్రాఫ్

పూరి, చార్మి లకు అలవాటు ఉందా?
అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

మీరు మొట్టమొదట డ్రగ్స్ తీసుకున్నది ఎక్కడ?
బలాదూర్ నగర్లో

అక్కడ ఇంకా ఎవరుండేవారు?
అమ్మ.నాన్న ఓ తమిళమ్మాయి.

మరి ఈ సెల్ఫీలో వాళ్లెవరు?
ఒకరాజు ఒకరాణి

మీరు ఇంకేమన్నా చెప్పదలచారా?
నేనింతే

ఇంటికెళ్లాక ఏంచేస్తారు?
శంభో శివశంభో …

 మరిన్ని వార్తలు

గౌతమ్ నంద… తెలుగు బులెట్ రివ్యూ.

స్టార్‌ మాను నెం.1 చేసిన బిగ్‌బాస్‌

పైసా వసూల్ స్టంపర్ అదిరిందిగా… వీడియో