Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసులో సిట్ ముందు విచారణకు హాజరైన సుబ్బరాజు ఏమి చెప్తాడో చూడాలి. అయితే ఈ ఆరోపణలు, పేర్లు బయటికి వచ్చినప్పుడు అందరి కంటే నమ్మకంగా గొంతు ఎత్తిన వాడు సుబ్బరాజు. తనకి ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువని చెప్పిన సుబ్బరాజు అల్లోపతి మందులకు కూడా దూరమని వివరించాడు. అవసరం అయితే సంప్రదాయ వైద్య విధానాల మీదే ఆధారపడతానని ఆయుర్వేదం గురించి చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు సిట్ ముందు కూడా సుబ్బరాజు అదే వాదన వినిపించే అవకాశం వుంది. అయితే సుబ్బరాజు చెప్పే ఆయుర్వేద కధలు సిట్ ఎంతవరకు నమ్ముతుందన్నదే అసలు ప్రశ్న.
శ్యాం కె నాయుడు కూడా తనకు సిగరెట్ అలవాటు కూడా లేదన్నారు. అలవాట్ల విషయంలో శ్యాం చెప్పింది నమ్మిన సిట్ అధికారులు పూరి గురించి సమాచారం చెప్పినప్పుడు మాత్రం తమకు అందుబాటులో వున్న సాక్ష్యాలు ప్రవేశబెట్టి ఆయన దగ్గర నుంచి నిజాలు రాబట్టారు. ఇప్పుడు సుబ్బరాజు కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సివుంటుంది.
మరిన్ని వార్తలు