వారిద్దరి పెళ్లితో ఈయనకు సంబంధం ఏంటి?

Rana Daggubati links His Marriage to Prabhas and Nithin

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌లో ప్రభాస్‌, రానా ఇంకా పలువురి పెళ్లి వార్తలు మీడియాలో చాలా కామన్‌ అయ్యాయి. ప్రభాస్‌ పెళ్లి గురించి ఏ స్థాయిలో వార్తలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ తర్వాత రానా పెళ్లి గురించి కూడా మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా వార్తలు వచ్చాయి. ‘బాహుబలి’ చిత్రం పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ మద్య రానా చెప్పుకొచ్చాడు. బాహుబలి పూర్తి అయిన తర్వాత కూడా రానా పెళ్లి గురించి మాట్లాడక పోవడంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో రానాకు మళ్లీ పెళ్లి ప్రశ్న ఎదురైంది. 

రానా పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు సమాధానంగా.. నా కంటే పెద్ద వారు ఇండస్ట్రీలో ఉన్నారు. వారి పెళ్లే ఇంకా కాలేదు. ప్రభాస్‌, నితిన్‌ల పెళ్లి అయిన తర్వాత నా పెళ్లి అంటూ కుండబద్దలు కొట్టేశాడు. రానా పెళ్లికి వారి పెళ్లితో సంబంధం ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ స్నేహితుడు అవ్వడంతో పాటు ఇద్దరు బందువుల మాదిరిగా మెలుగుతూ ఉంటారు. అందుకే ప్రభాస్‌ పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకుంటాను అంటూ రానా చెబుతున్నాడు. తన వయస్సు ఇంకా 34 సంవత్సరాలు మాత్రమే అని అప్పుడే తాను పెళ్లి చేసుకోవాల్సిన వయస్సు వచ్చిందని తాను భావించడం లేదని, తన ఇంట్లో వారు కూడా పెళ్లి  గురించి ఒత్తిడి తీసుకు రావడం లేదని చెప్పుకొచ్చాడు. ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోను అంటూ తేల్చి చెప్పాడు.

మరిన్ని వార్తలు:

రెబల్‌స్టార్‌ కాదు.. బ్లాక్‌ బస్టర్‌ కింగ్‌

ఇది మరీ ఓవర్‌ బోయపాటి