Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకరు 2019 ఎలక్షన్ లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న నాయకుడు… ఇంకొకరు ప్రత్యక్ష రాజకీయాలలో తొలిఅడుగు వేయటానికి సిద్దంగా ఉన్న నాయకుడు. రాజకీయాల్లో భిన్నధ్రువాలుగా ఉన్నారు జగన్- పవన్ కళ్యాణ్. అసలు వీరిద్దరు కలయుక సాధ్యపడేనా ? వీరిద్దరు కలిస్తే రాజకీయాలలో పెను మార్పు వేస్తుందని, వీరిద్దరు ఏకం కావాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రముఖ సినీ హీరో శివాజీ.
రాజకీయాలలో రావాలని, రాజకీయాలలో ఫోకస్ అవ్వటానికి ఎదో ఒక విషయం మీద అవసరం లేకపోయినా మీడియా ముందుకొచ్చి అధికార బీజేపీ టీడీపీలను ఇరుకున పెట్టాలని చూస్తుంటారు హీరో శివాజీ. జగన్- పవన్ కళ్యాణ్ కలవాలని, వాళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ని సువర్ణాద్రప్రదేశ్ గా చేయలని కోరుకుంటున్నాడు హీరో శివాజీ. విభజన సమస్యలపై కర్నూలులో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హీరో శివాజీ అటెండ్ అయ్యాడు. ఈ సమావేశంలో శివాజీ మాట్లాడుతూ చంద్రబాబు తన ప్రయోజనాలకోసం ఆంధ్రప్రదేశ్ ని కేంద్రంలో తాకట్టుపెట్టారని, ప్రత్యేకహోదా కోసం పోరాడకుండా చంద్రబాబు యువత జీవితాలని నాశనం చేస్తున్నాడు అని శివాజీ చంద్రబాబుపై మండి పడ్డాడు.
2019 ఎలక్షన్లలో వైసీపీ-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాను సాధించడానికి వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు నడుం బిగించాలని ఆయన అన్నారు. జగన్- పవన్ వల్లే ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరిగిద్ది అని శివాజీ పేర్కొన్నాడు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి సీపీఐ నేత రామకృష్ణ – ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కూడా హాజరయ్యారు.