Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Somu Veeraju Comments On Control Over The Liquor Shops In AP
కుంభకర్ణుడు ఆరు నెలలకోసారి నిద్రలేచి భోజనం చేసి మళ్లీ పడుకుంటాడట. అమిత్ షా వార్నింగ్ తో సైలంట్ అయిన సోము వీర్రాజు మళ్లీ టీడీపీ సర్కారుపై విరుచుకుపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే అమిత్ షా నుంచి సీక్రెట్ ఆదేశాలు రావాలి, లేదంటే సోముకు బీజేపీలో నూకలు చెల్లాయనుకోవాలి అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో మద్యం షాపులపై సర్కారుకు కంట్రోల్ లేదన్న సోము వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
అసలు సోము వీర్రాజును ఎమ్మెల్సీ చేసిందే టీడీపీ ప్రాజప్రతినిధులు. ఇప్పుడు వారికే ఎసరు పెడుతున్న వీర్రాజు తంత్రాన్ని బాబు గమనిస్తున్నారు. సైలంట్ గా తోక కత్తిరించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవేం తెలియని సోము మాత్రం తెగ రెచ్చిపోతున్నారు. ఇప్పటికే వెంకయ్య ద్వారా మోడీకి మెసేజ్ పంపిన బాబు.. ఎక్స్ ట్రాలు చేస్తే.. సోమును ఏం చేయాలో తెలుసని ఘాటుగా చెప్పారట. దీంతో తమ్ముళ్లు కూడా కుమ్ముడుకు రెడీ అవుతున్నారు.
ఏపీ ఎక్సైజ్ శాఖ అవినీతి అంటూ డబ్బా కొడుతున్న వీర్రాజు.. అసలు కేంద్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తమ్ముళ్లు ఎద్దేవా చేస్తున్నారు. డబ్బులే లేని రాష్ట్రంలో అవినీతి ఏంటని, నోట్లరద్దు, జీఎస్టీతో మోడీనే బాగా వెనకేశారని టీడీపీ కౌంటర్ రిటార్ట్ ఇస్తే పరిస్థితి ఏంటని సోము వ్యతిరేక వర్గం మథనపడుతోంది. మరి వీర్రాజు స్పీడుకు ఈసారి బ్రేకులెవరేస్తారో చూడాల్సి ఉంది.
మరిన్ని వార్తలు: