Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు మిత్రధర్మం గురించి పాఠాలు చెప్పిన బీజేపీ నాయకుడు,ఎమ్మెల్సీ సోము వీర్రాజు గుట్టు బట్టబయలు అయ్యింది. ఒక్క రోజులోనే ఆయన మాటల్లోని డొల్ల తనాన్ని బయటపెట్టే ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అవకాశం వచ్చినప్పుడల్లా సీఎం చంద్రబాబుని విమర్శిస్తూ వైసీపీ అధినేత జగన్ కి కొమ్ము కాచే విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సమక్షంలో విజయసాయి, సోము వీర్రాజు కూర్చున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తోంది. ప్రత్యేక హోదా గురించి జగన్ ప్రస్తావించినందుకు ఆయన మీద విమర్శలు చేసిన సోము రహస్యంగా ఆయన కుడి భుజం లాంటి విజయసాయితో కలిసి చేస్తున్న మంత్రాంగం ఏమిటో బయటకు చెబితే బాగుంటుంది. బీజేపీ , టీడీపీ మధ్య పొత్తు చెడగొట్టి వైసీపీ తో లంకె కుదర్చడానికి లోలోన సోము గారు ఏ రేంజ్ లో ప్రయత్నం చేస్తున్నారో ఈ ఫోటో చూస్తే అర్ధం అవుతుంది. అయితే ఈ లోగుట్టు బయటకు రాదన్న ధైర్యంతో చంద్రబాబుకు మిత్రధర్మం గురించి పాఠాలు చెప్పే స్థాయికి వచ్చారు సోము వీర్రాజు.
ఎమ్మెల్సీ పదవి రాకముందు నుంచే వైసీపీతో బీజేపీ ని కలపడానికి సోము గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అవకాశం లేకపోయినా కల్పించుకుని మరీ చంద్రబాబు సర్కార్ ని ఇబ్బంది పెట్టే కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో చూసి చూసి ఓ చిన్న మాట అన్నందుకు చంద్రబాబుకు మిత్ర ధర్మం గురించి చెప్పేసారు. కానీ కిందటి ఎన్నికల్లో ఓ పార్టీ తో కలిసి ఇంకో పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఇప్పుడు జగన్ ని సీఎం చేసే పూజలు,మంత్రాంగంలో బాసింపట్ల వేసుకు కూర్చున్న సోము కి మిత్ర ధర్మం గురించి మాట్లాడే అర్హత ఎక్కడ వుంది?. వైసీపీ ఆటలో పావుగా వ్యవహరిస్తూ పదవి ప్రసాదించిన పార్టీకి నష్టం చేస్తున్న సోము నైతికత గురించి మాట్లాడ్డం కూడా వేస్ట్.