తెలంగాణ ఎన్నికల ప్రచారం ఈరోజు (డిసెంబర్ 5) తో ముగియనునందున యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ ఈరోజు మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా, ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడంతో తన తరపున ప్రజా కూటమి కి ఓటు వేసి గెలిపించాలని ట్విట్టర్ వేదికగా ఒక వీడియో రూపంలో తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ట్విట్టర్ వీడియో ప్రసంగంలో సోనియా గాంధీ ఈవిధంగా ప్రసంగించారు “తెలంగాణలోని సోదర సోదరీమణులకు నా నమస్కారాలు. రానున్న డిసెంబర్ 7 న మీరందరూ మీయొక్క ఎమ్మెల్యే లను ఎన్నుకోవడానికి ఓట్లు వేయబోతున్నారు. ఆ ఓట్లు అనేవి తెలంగాణ భవిష్యత్తు ని నిర్ధేశించేవే కాకుండా మీ యొక్క భవిష్యత్తు ని కూడా నిర్ధేశిస్తాయి.
అందులో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ లు కలిసిన ప్రజకూటమి అనేది మీ తరపున వినిపించే గొంతు అవుతుంది.ఈ కూటమి మీది, ప్రతి వర్గానికి చెందిన వాళ్ళది. నాలుగున్నర ఏళ్ళ మునుపు తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు అయ్యింది.ఈ రాష్ట్ర ఏర్పాటులో నేను కీలకపాత్ర పోషించాను. కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత అధికారంలోకి వచ్చిన వారి చేతిలో తెలంగాణ ప్రజలు మోసపోయారు. తెలంగాణ ప్రజలు తమ ఆశలు, ఆశయాలు నెరవేర్చుకునే సరైన సమయం వచ్చేసింది.
మీ అమూల్యమైన ఓటు ని ప్రజకూటమికి వేసి, ప్రజకూటమి అభ్యర్థులను గెలిపించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక అవకాశం ఇవ్వమని కోరుకుతున్నాను.జై తెలంగాణ…జైహింద్”.మరోమారు సోనియాగాంధీ తెలంగాణాలో ప్రచారానికి వస్తారని ఆశిస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు ఇది నిరాశపరిచే విషయం అయినప్పటికీ ట్విట్టర్ వేదికగా సోనియా గాంధీ చేసిన విజ్ఞప్తి కాస్త ఊరట కలిగించే విషయం అయినప్పటికీ, అది ప్రజలను ఎంతమేరకు చేరుతుందో అనేది తెలియని విషయం. తరచుగా సోషల్ మీడియాలో సర్ఫింగ్ చేసే నెటిజన్స్ కి సోనియాగాంధీ ట్విట్టర్ వినతి గురించి తెలిసే అవకాశం ఉంటుందిగానీ, సామాన్య ప్రజలకు తెలిసే అవకాశం చాలా తక్కువ.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక అవకాశం ఇయ్యండి
మీ ఓటు ప్రజాకూటమికి వెయ్యండి#ByeByeKCR#EesariManaCongress pic.twitter.com/9W8p70jout— Telangana Congress (@INCTelangana) December 4, 2018