Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ, అమేథీ నియోజకవర్గాలంటే కాంగ్రెస్ ఆస్థానాలు అని చెప్పుకోవచ్చు. ఒక్క ఎమర్జెన్సీ సమయంలో మినహా పోటీస చేసిన ప్రతిసారి ఆ నియో్జకవర్గాల్లో గాంధీ నెహ్రూ కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు. ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కు పెట్టని కోటల్లాంటివి. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కాదు…రాష్ట్రంలో పార్టీ నామమాత్రంగా మారిన తరువాత కూడా అమేథీ, రాయ్ బరేలీలలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదు. ప్రత్యర్థులుగా ఎవరు పోటీచేస్తున్నారనేదాన్ని పట్టించుకోకుండా…నెహ్రూ గాందీ కుటుంబసభ్భులను గెలిపిస్తారు అమేథీ, రాయ్ బరేలీ ప్రజలు…అలాంటి చోట్ల ఇప్పుడు రాహుల్, సోనియా గాంధీలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
మొన్నటికి మొన్న రాహుల్ కనిపించటం లేదు అమేథీలో వాల్ పోస్టర్లు వెలసి కలకలం చెలరేగిన సంగతి మర్చిపోకముందే తాజాగా రాయబరేలీనూ అలాంటి పోస్టర్లే వెలిశాయి. నియోజకవర్గంలోని గోరాబజార్, మహానందపూర్, ప్రభుత్వ కాలనీలో ఈ పోస్టర్లు వెలిశాయి. లోక్ సభ ఎంపీ సోనియాగాంధీ కనిపించటం లేదు. ఆమె ఆచూకీ తెలిపిన వారికి తగిన రివార్డు అందజేస్తాం అని పోస్టర్లలో రాసి ఉంది. రాయ్ బరేలీ పీపుల్ పేరట డజన్ల కొద్దీ పోస్టర్లు వెలిశాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా సోనియాగాందీ రాయబరేలీ నియోజకవర్గానికి రాకపోవటంతో పాటు, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలను ఆమె చర్చించలేదన్న ఆగ్రహంతో స్థానిక ప్రజలు ఇలా పోస్టర్లు అంటించారని పలువురు భావిస్తున్నారు.
అయితే ఈ వాదనలను కాంగ్రెస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఈ పోస్టర్ల వెనక ఆరెస్సెస్, బీజేపీ కి చెందిన నేతల హస్తం ఉందని కాంగ్రెస నేతలు ఆరోపిస్తున్నారు. అమేథీలో రాహుల్, రాయబరేలీలో సోనియా గాంధీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోందని, అందులో భాగమే ఈ పోస్టర్లని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ను బలహీనపర్చాలంటే…ముందుగా సోనియా, రాహుల్ గాంధీలను తమ నియోజకవర్గాల్లో ఓడించాలని, దీనివల్ల కాంగ్రెస్ కార్యకర్తల నైతికస్థైర్యం దెబ్బతింటుందని వారు చెబుతున్నారు. అటు ఈ పోస్టర్ల వెనక ఎవరున్నప్పటికీ..రాహుల్, సోనియా లపై అమేథీ, రాయబరేలీ ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉన్న మాట మాత్రం నిజమేనని, అది పోవాలంటే తరచూ వారు నియోజకవర్గాలలో పర్యటిస్తూ…ప్రజలతో మమేకమవుతూ ఉండాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు: