డార్లింగ్ ప్రభాస్ నుంచి ప్రశాంత్ నీల్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్..!

Special birthday wishes from darling Prabhas to Prashant Neil..!
Special birthday wishes from darling Prabhas to Prashant Neil..!

కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఆ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే సక్సెస్ అందుకున్నారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఈ డైరెక్టర్ దూసుకుపోతుండటంతో, యావత్ ఇండియన్ మూవీ లవర్స్ ఈ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలవైపు చూస్తున్నారు.

Special birthday wishes from darling Prabhas to Prashant Neil..!
 

జూన్ 4న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రశాంత్ నీల్‌కు కన్నడతో పాటు ఇతర ఇండస్ట్రీల నుండి కూడా విషెస్ అందుతున్నాయి. తాజాగా ‘సలార్’ హీరో ప్రభాస్ కూడా ఈ క్రేజీ డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్ అందించారు. “లవ్ యూ సర్.. హావ్ ఎ బ్యూటిఫుల్ బర్త్ డే” అంటూ సలార్ షూటింగ్ సమయంలోని ఓ ఫోటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.ఈ కాంబినేషన్‌లో ‘సలార్-2’ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో ‘సలార్-2’ మూవీని స్టార్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.