ఐపీఎల్ 2024 టోర్నమెంటులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సంచలనం సృష్టించింది. బలమైన గుజరాత్ జట్టును ఏకంగా 6 వికెట్ల తేడాతో ఓడించగలిగింది ఢిల్లీ కాపిటల్స్. నిన్న గుజరాత్, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 89 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఢిల్లీ బౌలర్స్ లో దాటికి గుజరాత్ బ్యాటర్లు నిలువ లేకపోయారు. ఇక అనంతరం చేజింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 8.5 ఓవర్లలోనే 4వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేదించగలిగింది. దీంతో ఢిల్లీ కాపిటల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించుకుంది.