Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ , ఎస్ జె సూర్య, భరత్
నిర్మాత : మధు, నల్లమలపు బుజ్జి , మంజుల
దర్శకత్వం : ఎ ఆర్ మురుగదాస్
మ్యూజిక్ డైరెక్టర్ : హర్రిస్ జైరాజ్
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : సంతోష్ శివన్
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో స్పైడర్ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. అమెరికాలో ప్రీమియర్ షో మొదలైంది. భారత కాలమానం ప్రకారం అర్దరాత్రి 12 గంటల యాభై నిమిషాలకు ఆ షో మొదలైంది.
స్పైడర్ లైవ్ అప్ డేట్స్ ఇలా వున్నాయి …
-
12 .50 కి షో ప్రారంభం. టైటిల్స్ వేయడంలో కొత్తదనం వుంది. ఇక మహేష్ ఇంటలిజెన్స్ అధికారిగా పరిచయం.
-
1 గంట కి బూమ్ బూమ్ సాంగ్ స్టెప్స్ వెరైటీ గా వున్నాయి.
-
1 .10 టెలిఫోన్ ద్వారా రకుల్ మాట్లాడిన మాటలు రహస్యంగా విన్న మహేష్ .ఆమెని కలుసుకోవాలని ప్రయత్నం
-
1 .20 కి అచ్చమ్ తెలుగుదనం పాట . ఇది మాంటేజ్ పాటలా సాగుతుంది.
-
1 .30 కి హైదరాబాద్ లో ఇద్దరు అమ్మాయిల దారుణ హత్య. దీంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పని మొదలు పెట్టిన మహేష్.
-
1 .40 సిసిలియా సాంగ్. క్లాసిక్ మూవ్మెంట్స్ తో బాగా కలర్ ఫుల్ గా పిక్చరైజ్ చేశారు.
-
1 .50 మహేష్ వేటాడే ఓ నేరస్తుడికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్.
-
2 గంటలకి ఓ అమ్యూజ్ మెంట్ పార్క్ లో మహేష్, భరత్ మధ్య పోరాటం.
-
2 .10 కి మెయిన్ విలన్ భైరవుడిగా సూర్య ఎంట్రీ . హీరో, విలన్ ఒకరి కోసం ఇంకొకరు మొదలు పెట్టే వేటతో ఇంటర్వెల్ బ్యాంగ్.
ఫస్ట్ హాఫ్ లో ఇద్దరు సైకో సీరియల్ కిల్లర్స్,ఓ తెలివైన ఇంటలిజెన్స్ అధికారి మధ్య నడిచే కథ.
-
2 .30 కి సెకండ్ హాఫ్ ప్రారంభం. మహేష్, సూర్య మధ్య ఎటాక్, కౌంటర్ ఎటాక్ మొదలు .
-
2 .40 కి హాలి హాలి సాంగ్ . తర్వాత మహేష్ ప్లాన్ నుంచి గాయాలతో బయటపడ్డ విలన్ సూర్య .
-
2 .50 కి సూర్య ని పట్టుకోడానికి లేడీస్ కోసం ఓ టీవీ గేమ్ షో ప్లాన్ చేసిన ఎపిసోడ్ లో కామెడీ .
-
3 కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి తనని తప్పించమని బాస్ ని మహేష్ ఒప్పించడం. ఇక్కడ కామెడీ బాగా పండింది.
-
3 .10 కి లాంకో హిల్స్ లో జనాన్ని కాపాడే సీన్ బాగా తీశారు.
-
3 .20 కి హాస్పిటల్ లో క్లైమాక్స్ ఫైట్ .
-
3 .25 కి ప్రజలకి మహేష్ ఇచ్చే సందేశం. ఫేస్ బుక్ లతో మాట్లాడడం కాకుండా సాటి మనిషి పట్ల ప్రేమ,దయతో వ్యవహరించాలని మహేష్ చెప్పడంతో స్పైడర్ ముగుస్తుంది.