నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నసినిమా భగవంత్ కేసరి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ లీల బాలకృష్ణకు కూతురి పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే భగవంత్ కేసరి నుంచి విడుదలైన మొదటి పాటలో బాలకృష్ణ, శ్రీ లీలా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒక్క పాటతోనే సినిమాపై హైప్ భారీగా పెంచేశారు. ఇటీవల ఒక సందర్భంలో భగవంత్ కేసరి విశేషాలను బాలకృష్ణతో తనకున్న అనుభవాలను పంచుకున్నది శ్రీ లీల . సాటి నటులకు బాలకృష్ణ ఇచ్చే గౌరవం చూసి ఫిదా అయిపోయానని తన మనసులో ఉన్న మాటను వెల్లడించింది.
శ్రీ లీల బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ సార్ బయట వేరు.. కెమెరా ముందుకు వస్తే అప్పుడు వేరు.. ఒక్కసారి పాత్రలోకి ఎంటర్ అయ్యారు అంటే ఇక ఆయన భగవంత్ కేసరే.. పాత్రలో అంతలా లీనం అయిపోతారు. ఇందులో మా పాత్రల గురించి రివీల్ చేయడం నాకు ఇప్పుడు ఇష్టం లేదు. అయితే ఈ మూవీ చేస్తున్నంత సేపు ఆయన నాకు సొంత బాబాయ్ లాగే అనిపించారు. ముఖ్యంగా ఆయన కూడా లొకేషన్లో నన్ను కూతురితో సమానంగా చూసుకున్నాడు . మరో అవకాశం వస్తే ఖచ్చితంగా బాలయ్య సార్ తో ఇంకో మూవీ చేయాలని ఉంది అంటూ భావోద్వేగానికి గురైంది శ్రీ లీల.ఇకపోతే ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు తెగ వైరల్ గా మారుతున్నాయి.
శ్రీ లీల విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. సీనియర్ హీరోలతోపాటు సినిమాలలో కూడా నటిస్తున్న శ్రీ లీల ఈ ఏడాది సుమారుగా 3,4 చిత్రాలను విడుదలకు వుంచడం గమనార్హం.