వివాదాస్పద తార శ్రీరెడ్డి మరోసారి మీడియాకు వచ్చింది. సైదాబాద్‌లో ఒక షాప్ ఓపెనింగ్స్‌కు వెళ్లిన శ్రీరెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల గురించి ప్రస్థావించడం జరిగింది. ఇన్ని రోజులు పలువురు హీరోలు, హీరోయిన్స్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఇటీవలే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా ఈమెకు రెండు రాజకీయ పార్టీల నుండి టికెట్ ఆఫర్ ఉందని, కాని తాను మాత్రం ఆసక్తిగా లేను అంటూ చెప్పుకొచ్చింది. రాజకీయాల జోలికి వెళ్లాలని ప్రస్తుతానికి తాను భావించడం లేదని చెప్పిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌పై మరోసారి దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసింది.
ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సత్తా చాటుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కాని అక్కడ అంత సీన్ లేదు. మూడు నాలుగు సీట్లు మినహా పవన్ కళ్యాణ్‌కు అక్కడ పెద్దగా సీట్లు దక్కవు అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. జనసేన పార్టీ నాయకులు పవన్ విషయంలో మోస పోతున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. తాను ఒక పార్టీలో చేరబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగులో ఒక చిత్రాన్ని చేస్తున్న తాను అక్కడ వరుసగా చిత్రాలు చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. తనను కొందరు టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను విమర్శించే ముందు వారికి వారు సమాధానం చెప్పుకోవాలంటూ ఆమె పేర్కొంది. శ్రీరెడ్డి జనసేనపై చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.