Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దుబాయిలో హార్ట్ఎటాక్తో మృతి చెందిన అతిలోక సుందరి శ్రీదేవి మృతదేహంను ఇండియాకు తీసుకు వచ్చే ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. దుబాయిలో అనారోగ్య కారణాలతో చనిపోయిన వారికి పోర్ట్ మార్టం ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే దాదాపు 24 గంటల పాటు అక్కడ హాస్పిటల్లో శ్రీదేవి మృతదేహంను ఉంచాల్సి వచ్చింది. ఎట్టకేలకు శ్రీదేవి పోస్ట్మార్టం పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఇక దుబాయి నుండి ఇండియాకు శ్రీదేవి మృతదేహంను తరలించేందుకు ప్రత్యేక జెట్ విమానంను సిద్దం చేశారు.
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి చెందిన ప్రత్యేక జెట్ విమానంను దుబాయి పంపించడం జరిగింది. ఇప్పటికే అంబానీ జెట్ విమానం దుబాయి చేరుకుందని, అక్కడి ప్రభుత్వం శ్రీదేవి మృతదేహంను అప్పగించిన వెంటనే ఆ జెట్ విమానంలోనే కపూర్ ఫ్యామిలీ సభ్యులు శ్రీదేవి మృత దేహంతో ఇండియాకు రాబోతున్నారు. 15 మంది కూర్చునే వీలుండే ఆ విమానం శ్రీదేవిపై తనకున్న అభిమానంతో అంబానీ పంపించినట్లుగా తెలుస్తోంది. తమ కుటుంబ సొంత అవసరాలకు వాడేందుకు జెట్ విమానంను ముకేష్ అంబాని వినియోగిస్తూ ఉంటారు. శ్రీదేవి మృతదేహంను ఇండియాకు తీసుకు వచ్చేందుకు అంబానీ విమానంను పంపించడంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. శ్రీదేవి పార్దీవ దేహం కోసం ఇండియాలో లక్షలాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు సాయంత్రం వరకు ఆమె మృత దేహం ఇండియాకు చేరుకునే అవకాశం ఉంది.