మరో స్టార్‌ హీరోని కెలికిన శ్రీరెడ్డి…!

Srireddy Comments About Kollywood Stars

కాస్టింగ్‌ కౌచ్‌ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతాను, తెలుగు అమ్మాయిలకే టాలీవుడ్‌లో ఛాన్స్‌ ఇవ్వాలి, గతంలో నన్ను చాలామంది అవకాశాలు ఇస్తామని వాడుకుని ఆ తర్వాత చేతులు దులిపేశారు అంటూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి నానా హంగామ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ అమ్మడిని అంతా పక్కన పెట్టారు. దాంతో ఇక చేసేది లేక తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అక్కడ శ్రీరెడ్డికి రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాల్లో నటిస్తూ అక్కడ సైలెంట్‌గా ఉండకుండా ఈ అమ్మడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కోలీవుడ్‌లోని పలువురు సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి వివదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా తమిళ స్టార్‌ హీరోపై సంచలన ఆరోపణలు చేసింది.

sree-reddy-images

కోలీవుడ్‌ నిర్మాతల మండలిలో కీలక బాద్యత నిర్వహిస్తున్న స్టార్‌ హీరోపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. నీవు ఎంత మంది హీరోయిన్లను వాడుకున్నావో, ఎంత మంది సైడ్‌ ఆర్టిస్టులను లైంగికంగా వేదించావో ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. కీలక పదవిలో ఉన్న నువ్వు చిన్న నిర్మాతలను తొక్కేస్తు ఎంత పుచ్చుకుని అక్రమంగా సంపాదిస్తున్నావో తెలుసు. మీడియా ముందు మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌లాగా మాట్లాడే నీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. నీ సైజ్‌ తెలుసు, నీ కలర్‌ తొసు. త్వరలోనే పక్కా ఆదారాలతో నీ బండారాన్ని బయటపెడతాను, దాంతో నీ ఎమ్మెల్యే సీటు, నీ పదవి, హీరోగా నీ పేరు అంతా కూడా పతనం కాబోతుంది అంటూ తమిళ స్టార్‌ హీరో పేరు చెప్పకనే చెబుతూ ఆ స్టార్‌ హీరోని కెలికింది. దీంతో ఈమె పరిస్థితి కోలీవుడ్‌లో ఎలా ఉంటుందో చూడాలి మరి.

Sri Reddy Hot Comments On Sachin Tendulkar