Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆయన రాజకీయాల్లో ఎప్పటినుంచో వున్నాడు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా పెద్దగా పేరు ప్రఖ్యాతులు సంపాదించలేకపోయినా బి.కామ్ ఫిజిక్స్ తో ఒక్కసారిగా మార్మోగిపోయాడు. ఆయనే జలీల్ ఖాన్. మైనారిటీ కోటాలో క్యాబినెట్ లో చోటు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈయన. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ సీఎం చంద్రబాబుని ఎన్నోసార్లు వేడుకున్నాడు జలీల్ ఖాన్. వైసీపీ నుంచి వచ్చిన జలీల్ కి బాబు ఛాన్స్ ఇచ్చే వారో లేదో తెలియదు గానీ ఇంతలో బి.కామ్ లో ఫిజిక్స్ ఇంటర్వ్యూ బయటికి వచ్చింది. జలీల్ అవకాశాలకు బ్రేక్ పడింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత జలీల్ ఖాన్ కి మినిస్టర్ పోస్ట్ ఇవ్వడానికి ఓ విధంగా బాబు భయపడ్డారు.
ఆ విధంగా బాబు దగ్గర అవకాశాలకు గండికొట్టిన బి.కామ్ ఫిజిక్స్ ఇంటర్వ్యూ ఇప్పుడు జలీల్ ఖాన్ కి ఎన్టీఆర్ దగ్గర అవకాశం తెచ్చి పెట్టింది. ఆయన హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ కార్యక్రమం లో పాల్గొనేవాళ్ళు వివాదాస్పదులు గానీ, వినోదం పంచే వాళ్ళు అయి వుండాలని భావిస్తున్న స్టార్ మా నిర్వాహకులు జలీల్ ఖాన్ ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. తనని ఎందుకు ఈ షో కి ఆహ్వానిస్తున్నారో జలీల్ ఖాన్ కి తెలియదా ? అందుకే ఈ ఆఫర్ ని జలీల్ ఖాన్ ఒప్పుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఏమిటో జలీల్ జాతకం… బాబుని ఛాన్స్ అడిగితే ఆయన ఇవ్వలేకపోయాడు. ఆ ఛాన్స్ కి అడ్డం పడిన ఇంటర్వ్యూ ఎన్టీఆర్ దగ్గర ఛాన్స్ తెచ్చినా జలీల్ ఒప్పుకోలేడు.
మరిన్ని వార్తలు