Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపై ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. బుల్లి తెరపై ఎన్టీఆర్ కనిపించబోతున్నాడనగానే ఎలా ఉంటాడు, బుల్లి తెర ప్రేక్షకులను ఆయన ఆకట్టుకుంటాడా అంటూ చర్చ జరిగింది. వెండి తెరపై ఎలా అయితే ఆకట్టుకున్నాడో బుల్లి తెరపై అదే స్థాయిలో యంగ్ టైగర్ మెప్పించాడు. ఏమాత్రం ఇబ్బంది పడకుండా బుల్లి తెరపై తనదైన శైలిలో బిగ్‌బాస్ షోను నడిపిస్తూ తెలుగులోనే నెం.1 ఛానెల్‌గా స్టార్ మాటీవీని నిలపడం జరిగింది. స్టార్ మాటీవీకి మునుపెన్నడు లేని రేటింగ్ రావడంతో అప్పుడే బిగ్‌బాస్ సీజన్ 2 గురించి చర్చలు జరుగుతున్నాయి.
బిగ్‌బాస్ సీజన్ 2ను కూడా ఎన్టీఆర్‌తో చేయాలని నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. రెండవ సీజన్‌కు కొన్ని ప్రత్యేక హంగులు అద్దడంతో పాటు, పార్టిసిపెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ కారణంగా భారీ క్రేజ్ వచ్చింది. అందుకే ఆయన పారితోషికాన్ని భారీగా పెంచే ఆలోచనలో స్టార్ మాటీవీ ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి సీజన్‌తో పోల్చితే రెండవ సీజన్‌కు 50% అదనంగా పారితోషికం ఇవ్వాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ పారితోషికంతో పాటు పార్టిసిపెంట్స్‌ను కాస్త ఎక్కువ ఖరీదు వారిని ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే రెండవ సీజన్‌కు సంబంధించిన పనులు మొదలు పెట్టే అవకాశాలున్నాయి. వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ షో రెండవ సీజన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. అది కుదరకపోతే ఏప్రిల్‌లో రెండవ సీజన్ ప్రసారం అవ్వనుందని స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని వార్తలు: