Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి వివాదాస్పద మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిని హత్యచేశారనే అనుమానం కలుగుతోందని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. దుబాయ్ పోలీసులు విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్ట్ పై ఆయన అనుమానాలు వ్యక్తంచేశారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదని… ఆమెతో బలవంతంగా మద్యం సేవించారా అనే అనుమానం కలుగుతోందని, అసలు ఏం జరిగిందనేది పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించేదాకా వేచి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ మొత్తం వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజ్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. శ్రీదేవి మరణం తర్వాత దుబాయ్ డాక్టర్లు అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి ఆమె గుండెపోటుతో చనిపోయారని ప్రకటించారని, ముందస్తు వ్యూహంలో భాగంగానే ఇది జరిగిందని భావిస్తున్నానన్నారు. సినీతారలకు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధాలు ఉన్నాయని, ఈ వైపుగా దృష్టి కేంద్రీకరించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాలో వస్తున్న విషయాలు స్థిరంగా ఉండవన్న అభిప్రాయం వ్యక్తంచేశారు.