జైలుకి వెళ్ళడం వెనక చిరంజీవి హ్యాండ్…సుమన్ సంచలనం !

Suman Clarifies About Chiranjeevi Interference In Blue Film Case

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సుమన్ అప్పట్లో ఒక బ్లూ ఫిలిమ్స్ కేసులో అరెస్ట్ అవడం సంచలనం రేపింది. ఈ కేసులో ఆయన దాదాపు మూడేళ్లు జైల్లో గడిపారు. అయితే ఆయనపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో తర్వాతి రోజుల్లో ఈ కేసు నుంచి బయట పడ్డారు. ఈ కేసు సుమన్ సినిమా కెరీర్ మీద చాలా ఎఫెక్ట్ చూపింది. అప్పట్లో దీని పై రకరకాల ప్రచారం జరిగింది. ఆయన్ను ఇందులో ఇరికించింది చిరంజీవి ఫ్యామిలీ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను సుమన్ పలు సందర్భాల్లో ఖండించారు. తాజాగా మరో ఇంటర్వ్యూలో సుమన్ ఆ కేసు విషయమై ఎదురైన ప్రశ్నలపై క్లారిటీ ఇచ్చారు.

ఈ కేసులో చిరంజీవి, వారి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనే వార్తల్లో నిజం లేదు. ఇది చిరంజీవి అంటే పడని వారు చేసిన తప్పుడు ప్రచారం. ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ డేట్స్ ఇస్తే మంచివాడు, డేట్స్ ఇవ్వకపోతే చెడ్డవాడు. అలా ఆయనంటే పడనివారు ఈ పుకార్లు పుట్టించారని అన్నారు. చిరంజీవితో అప్పట్లో నాకు ఒక ఇష్యూ ఉండేదమో కానీ ఈ కేసుతో ఆయనకు ఎలాంటి లింక్ లేదని ఆ రోజుల్లో ఇంటర్నెట్, టీవీ ఛానల్స్ లేవు. మేజగైన్లు, పేపర్లు మాత్రమే ఉండేవి. వారు కూడా తమ సర్క్యులేషన్ పెంచకోవడానికి ఇలాంటి వార్తలు రాసేవారని సుమన్ చెప్పుకొచ్చారు.