సంక్రాంతి సినిమాలు రిలాక్స్‌ అవ్వొచ్చు…!

Rajinikanth Petta Movie Release Suspense

మరికొన్ని రోజుల్లో రజినీకాంత్‌ చిత్రం ‘2.ఓ’ విడుదల కాబోతుంది. మరో వైపు రజినీకాంత్‌ పేట మూవీ కూడా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న పేట మూవీని సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఈ చిత్రంను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. జనవరిలో వస్తే ఈ చిత్రం పోటీకి పలు చిత్రాలు చెల్లా చెదురు అవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు. సంక్రాంతికి రామ్‌ చరణ్‌ ‘వినయ విధేయ రామ’ చిత్రంతో పాటు ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రాలు కూడా రాబోతున్నాయి. ఎఫ్‌ 2 చిత్రంతో పాటు మరో రెండు మూడు చిన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ ముందుకు రాబోతున్నాయి.

petta-movie

ఇన్ని సినిమాల నడుమ రజినీకాంత్‌ పేట సినిమా వస్తే ఆ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం. ఎందుకంటే రజినీకాంత్‌ మూవీ అంటే ప్రేక్షకుల్లో యమ క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌ కారణంగానే రికార్డు స్థాయిలో పేట మూవీకి బిజినెస్‌ అవుతోంది. అందుకే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఇతర చిత్రాల పరిస్థితి కష్టమే అంటూ అంతా అనుకున్నారు. అయితే పేట చిత్రం విడుదల వాయిదా వేయడంతో వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా తమిళ పరిశ్రమలో కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రాలు రిలాక్స్‌ అయ్యాయి. పేట కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

rajani-petta