Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్ లోకి రోహింగ్యా ముస్లింల అక్రమవలసపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. రోహింగ్యాల అంశం మానవహక్కులతో ముడిపడి ఉందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రోహింగ్యాల విషయంలో దేశ భద్రత మాత్రమే కాకుండా మానవ హక్కులనూ దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు అప్పటి వరకు రోహింగ్యాలను వెనక్కి పంపవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మయన్మార్ లో మైనార్టీలుగా ఉన్న రోహింగ్యాలను ఆర్మీ ఆ దేశం నుంచి తరిమేస్తోంది. దీంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బంగ్లాదేశ్ మీదగా భారత్ లో ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రోహింగ్యాలు భారత్ వచ్చారు. అయితే వారి ప్రవేశంపై కేంద్రం సానుకూలంగా లేదు. హిందూ సంస్థలు కూడా రోహింగ్యాల వలసను వ్యతిరేకిస్తున్నాయి. రోహింగ్యాలు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమైన వారని కొందరు ఆరెస్సెస్ నేతలు ఆరోపించారు. వారు శరణార్థులు కాదని దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులని ఇటీవలే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా వ్యాఖ్యానించారు.