ఓటీటీ, సోషల్ మీడియాలో లైంగిక, అసభ్యకరమైన కంటెంట్ ప్రసారాన్ని నియంత్రించేలా వాటిపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన పలు అంశాలను జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాషితో కూడిన ధర్మాసనం లేవనెత్తింది. అనంతరం ఈ అంశంపై స్పందించాలంటూ కేంద్రంతోపాటు నెటిఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్,యూట్యూబ్‌లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.





