సమంత కెరీర్‌లో ‘యూటర్న్‌’ ప్రత్యేకం, ఎందుకంటే!

U Turn Movie Producer Samantha

సమంత అక్కినేని తాజాగా యూటర్న్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యూటర్న్‌’ చిత్రం సమంత కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైన చిత్రంగా చెప్పుకోవచ్చు. సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే సినిమాకు ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లను రాబట్టలేక పోతుంది. భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల అయిన నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్‌ వస్తాయని అంతా భావించారు. కాని కాస్త నిరాశ పర్చాయని చెప్పుకోవచ్చు. అయితే యూటర్న్‌ చిత్రంకు సమంత మంచి పారితోషికం అందుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

U-Turn

‘రంగస్థలం’ చిత్రంకు సమంత కోటి రూపాయల పారితోషికం తీసుకుంది. గతంలో బెల్లంకొండతో నటించేందుకు ఏకంగా రెండు కోట్ల రూపాయలను దక్కించుకుంది. ఆ తర్వాత కోటి, కోటిన్నర వరకు పారితోషికం దక్కించుకుంది. కాని యూటర్న్‌ చిత్రంకు మాత్రం మొదటి సారి ఏకంగా మూడున్నర కోట్లను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. యూటర్న్‌పై నమ్మకంతో ఈ చిత్రం లాభాల్లో వాటాను సమంత డిమాండ్‌ చేసింది. అందుకే తన సొంత సినిమా అన్నట్లుగా భారీ పబ్లిసిటీ చేసింది. సినిమాకు భారీ హైప్‌ తీసుకు రావడంలో సక్సెస్‌ అయిన కారణంగా మంచి రేటుకు అన్ని ఏరియాల్లో ఈ చిత్రం అమ్ముడు పోయిందని, దాంతో సమంతకు మూడున్నర కోట్ల వరకు పారితోషికం రూపంలో వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే సినిమా ద్వారా మరో అరకోటి వరకు సమంత ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈ చిత్రంతో దాదాపు నాలుగు కోట్ల మేరకు సమంత తీసుకుంది కనుక ఈ చిత్రం సమంత కెరీర్‌లో ప్రత్యేకం అంటూ చెప్పుకోవచ్చు.