Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా గ్రూపు తగాదాలకు పెట్టింది పేరు కాంగ్రెస్. ఏకంగా సోనియా నిర్ణయాన్నే వ్యతిరేకించిన ఘనులున్న పార్టీ అది. అలాంటిది ఎవరో కుంతియా చెబితే వింటారా. ఇప్పుడదే జరిగింది. 2019 ఎన్నికల్లో ఉత్తమ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తామన్న కుంతియా మాటల్ని రెండోరోజే కాంగ్రెస్ నేతలు ఖండించేశారు. కుంతియాకు సీన్ లేదని తేల్చేశారు.
అసలు దిగ్విజయ్ కు ఇచ్చినంత విలువ కుంతియాకు ఇవ్వని నేతలు.. ఆయన స్టేట్ మెంట్ ను కూడా లైట్ గా తీసుకున్నారు. జానారెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వంటి సీనియర్లెవరూ కుంతియాకు ముఖం చూపించలేదు. పైగా ఉత్తమ్ కొనసాగుతారని చెప్పడానికి ఆయనెవరని మండిపడ్డారు. ఇప్పటికే ఢిల్లీకి ఫోన్లు చేసి క్లారిటీ తీసుకున్నారు. అక్టోబర్లో మార్పు ఖాయమని చెప్పేస్తున్నారు.
పార్టీ ఇంఛార్జ్ అయితే నోటికొచ్చింది చెబుతారా అని మండిపడుతున్నారు. సీనియర్లను సంప్రదించకుండా, అందరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్ష ప్రకటన చెల్లదని తేల్చిపారేశారు. దీంతో అందర్నీ ఏకతాటిపైకి నడిపించాలని పంపిస్తే.. ఇలా చేశాడేంటని కుంతియాపై అధిష్ఠానం ఫైరైందని ప్రచారం జరుగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే.. కాంగ్రెస్ 2019లోనే కాదు 2024లో కూడా అధికారంలోకి రాదని అనుకుంటున్నారు క్యాడర్.
మరిన్ని వార్తలు: