తమిళంలో భారీ అంచనాల నడుమ తెరకెక్కి అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘96’. ఈ చిత్రంను మొదట డబ్బింగ్ చేయాలని భావించారు. అందుకోసం తెలుగులో ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయాలని భావించారు. కాని సినిమాపై ఉన్న అంచనాలు మరియు కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రంను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని నిర్మాత దిల్‌రాజు భావించాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. నాని మరియు సమంతలు కలిసి 96 రీమేక్‌లో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. భారీ ఎత్తున ఈ చిత్రంపై అంచనాలున్న నేపథ్యంలో రీమేక్ హక్కులను కొనుగోలు చేశాం. అయితే నాని, సమంతలు కలిసి ఈ రీమేక్‌లో నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, ఇంకా నటీనటులు మరియు దర్శకుడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న పుకారులో సగం నిజం ఉంది, సగం అబద్దం ఉందని చెప్పుకోవచ్చు. సినిమా తమిళంలో విడుదల అయిన తర్వాత పూర్తి వివరాలను దిల్‌రాజు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.