దర్శకుడి అనుమానస్పద మృతి….దారుణ స్థితిలో దొరికిన శవం !

sivakumar found dead his residence mysterious circumstances

తమిళ దర్శకుడు ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రముఖ దర్శకుడు శివ కుమార్ తన నివాసంలో అనుమాస్పదంగా మృతి చెందారు, ఆయన శవం కూడా కుళ్ళిపోయిన స్థితిలో పోలీసులు ఆయనని కనుగొన్నారు. తమిళ సోప్పేర్ స్టార్ అజిత్ హీరోగా   ‘రెట్టయి జాడి వయసు’ అనే చిత్రం తెరకెక్కించిన ఆయన చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. ఆయన రెండు రోజుల నుండి బయటకు రాకపోవడం, ఆయన ఫ్లాట్తా నుండి అదో రకమయిన దుర్వాసన వస్తుందని గ్రహించిన అక్కడి స్థానికులు పెలీసులకి సమాచరం ఇచ్చారు. అక్కడికి పోలీసులు వచ్చి తలుపూ బద్దలుకొట్టి చూడగా అక్క ఆయన శవం కుళ్లిపోయి కనిపించింది.

రెండు మూడు రోజుల క్రితం ఆయన చనిపోయి ఉండచ్చని తెలుస్తోంది. అయితే ఇన్ని రోజుల పాటు ఆయన అలా ఉన్నా కుటుంబ సభ్యులు ఎవరూ చూడడానికి రాకపోవడం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. శివ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మరణవార్త విన్న తమిళ సినీ ఇండస్ట్రీ షాక్ కి గురయ్యింది. కుళ్లిన స్థితిలో ఉన్న ఆయన శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈ కేసు విషయంలో క్లారిటీ వచ్చేవరకు ఆయన బౌతిక కాయాన్ని అంత్యక్రియలకి పంపకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.