Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాట సినీ రంగం వారు రాజకీయాల్లోకి వెళ్లడం సర్వ సాదారణం. ఎంతో మంది తమిళ సినీ ప్రముఖులు అత్యున్నత పదవులు అధిరోహించారు. ఇటీవల చనిపోయిన మాజీ సీఎం జయలలిత కూడా హీరోయిన్ అనే విషయం తెల్సిందే. అందుకే వారి దారిలోనే ప్రస్తుతం పువురు సినీ సెలబ్రెటీలు రాజకీయాల్లో అడుగు పెట్టాలని ఉవ్విల్లూరుతున్నారు. ఇప్పటికే రజినీకాంత్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇక కమల్ హాసన్ తాను సీఎం అవుతాను అంటూ చెబుతున్నాడు. వీరిద్దరి మద్య పోటీ తీవ్రంగా ఉండబోతుందనుకుంటున్న సమయంలో విశాల్ కూడా రాజకీయ అరంగేట్రం చేస్తాను అంటూ సన్నిహితులతో చెబుతున్నాడు.
తమిళ స్టార్ హీరో అయిన విశాల్ సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందిస్తూ, ఉద్యమిస్తూ ఉంటాడు. మూవీ ఆర్టిస్టుల తరపున పోరాడటంతో పాటు, పలు సమస్యలను ఇండస్ట్రీ నుండి తరిమికొట్టడంలో విశాల్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు విశాల్ రాజకీయాలపై దృష్టి పెడుతున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. సినీ రంగంలో విశేష ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారు రాజకీయాల్లో రాణించగలరు అని చెప్పలేం. కాని విశాల్‌కు సామాజిక దృక్పదం ఎక్కువ. అందుకే విశాల్‌కు రాజకీయల్లో విజయం సాధించగల సత్తా ఉందని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే విశాల్ రాజకీయాల్లోకి ఎలా వస్తాడు, కొత్త పార్టీ ద్వారానా లేక మరే పార్టీలో అయినా చేరుతాడా అనే విషయం తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు: