Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Tamil Nadu CM Palaniswamy Going To Loose CM Post
ఏదైనా పదవి శాశ్వతం కాకపోతే.. దాన్ని తుమ్మితే ఊడిపోయే ముక్కుతో పోల్చుతారు. తాత్కాలిక ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత లేని కొలువులకు కూడా ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు తమిళనాడు సీఎం పళనిస్వామి పరిస్థితి అంతకంటే బాగా ఏం లేదు. చచ్చీచెడీ బలపరీక్ష నెగ్గితే.. ఇప్పుడు మళ్లీ అవిశ్వాస తీర్మానం పెడతానంటున్న స్టాలిన్.. ఆయన్ను భయపెడుతున్నారు.
కానీ ఈసారి పళనిస్వామి కూడా తీవ్రంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతిసారీ ఎవరో ఒకరు సీఎంకు బలం లేదని ఎద్దేవా చేస్తుంటే ఆయన భరించలేకపోతున్నారు. స్టాలిన్ కు దమ్ముంటే అవిశ్వాసం పెట్టుకోవచ్చని, తన బలం ఏంటో అసెంబ్లీలోనే నిరూపిస్తానని సన్నిహితులతో అంటున్నారట పళని. మరి స్టాలిన్ ఊరికే స్టేట్ మెంట్ ఇచ్చారా.. నిజంగా అవిశ్వాసం పెడతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ మధ్య కాలంలో పన్నీర్, పళని మధ్య కూడా కాస్త సంబంధాలు మెరుగుపడ్డాయి. శశికళ ఫ్యామిలీకి క్యాబినెట్ దూరంగా ఉంది కాబట్టి.. వారిని పడగొట్టే ప్రయత్నానికి పన్నీర్ మద్దతు ఇవ్వకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అన్నింటికీ మించి పళనికి మోడీ ఆశీస్సులు లభించాయంటున్నారు. అదే నిజమైతే స్టాలిన్ ను పరోక్షంగా బీజేపీ కంట్రోల్ చేస్తుందనే వాదనా ఉంది. అందుకే పళనిస్వామి అంత ధీమాగా ఉన్నారనేది ఈ వార్తల సారాంశం.
మరిన్ని వార్తాలు :