Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళంలో ఎన్నో అద్బుత చిత్రాల్లో నటించిన నిన్నటి తరం స్టార్ హీరో శరత్ కుమార్‌కు కోర్టు మొట్టికాయలు వేసింది. ఆ మద్య శరత్ కుమార్ మరియు ఆయన భార్య రాధికలు కలిసి ఒక సినిమాను నిర్మించారు. ఆ సినిమా నిర్మాణం కోసం రాడియన్స్ అనే సంస్థ నుండి 1.5 కోట్ల రుణంను తీసుకోవడం జరిగింది. అందుకు గాను సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ మరియు తాము తర్వాత చేయబోతున్న సినిమా రైట్స్‌ను కూడా ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అలా రెండవ సారి కూడా కొంత మొత్తంలో అప్పు తీసుకున్నారు. ఆ మొత్తంను 2015 మార్చిలో తీర్చుతాం అంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాని శరత్ కుమార్ ఆ మొత్తంను అనుకున్న సమయంలో ఇవ్వలేక పోయాడు.
రుణం తీసుకున్న సమయంలో రాడియన్స్ సంస్థకు తమ విలువైన ఆస్తులను తనకా పెట్టడం జరిగింది. అప్పులు ఎక్కువ అవ్వడంతో ఆస్తులు అమ్మి వాటిని సెటిల్ చేయాలని రాధిక మరియు శరత్ కుమార్‌లు భావించారు. అందుకు కుదవ పెట్టిన ఆస్తులను కూడా అమ్మేయాలని వారు ప్రయత్నించారు. దాంతో రాడియన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. కుదవలో ఉన్న ఆస్తులను అమ్మాలని ప్రయత్నించినందుకు గాను శరత్ కుమార్ అండ్ కో కు రెండు లక్షల ఫైన్‌ను విధిస్తున్నట్లుగా తీర్పు వచ్చింది. శరత్ కుమార్‌కు ఆ మొత్తం చెల్లించడం పెద్ద కష్టం ఏమీ కాదు. కాని ఆయన పరువు పోయినట్లయ్యింది
మరిన్ని వార్తలు