ఇండస్ట్రీ పరువు తీశారు

tammareddy bharadwaj fires on maa controversy

తెలుగు పరిశ్రమ పరువును మా పెద్దలు తీశారు అంటూ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కూర్చుని మాట్లాడితే పోయేదానికి తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం తల దించుకునేలా మీడియా ముందు మాట్లాడి వారి పరువును వారే తీసుకున్నారు అంటూ ఈయన ఆవేదన వ్యక్తం చేశాడు. పరిశ్రమలో ఇలాంటివి అప్పుడప్పుడు చాలా కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. కాని ఇలాంటివి బయటకు వస్తే రోడ్డున పడ్డట్లే. కాని ఆ విషయాన్ని పట్టించుకోకుండా నరేష్‌ మరియు శివాజీరాజాలు ఒకరిపై ఒకరు చేసుకున్న అభియోగాలు మొత్తం పరిశ్రమను ప్రజలు అనుమానించే విధంగా చేశాయి.

maa controversy

ఈ వివాదం చూస్తుంటే నాకు కోపంతో పాటు నవ్వు కూడా వస్తుంది. నరేష్‌ మరియు శివాజీలు ఇద్దరు కూడా నాకు చిన్నప్పటి నుండి తెలుసు. వారిద్దరు కూడా ఎప్పుడు స్వార్థపూరితంగా ఆలోచించరు. ఇద్దరు కూడా ఇండస్ట్రీకి కావాల్సిన వారు. ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమంకు కోటి రూపాయలు ఇస్తామంటే సంతకం పెట్టే ముందు ఇంకా ఎక్కువ వస్తుందేమో అని ఆలోచించాల్సి ఉంది. కాని సంతకం పెట్టిన తర్వాత ఇలా మాట్లాడటం భావ్యం కాదని తమ్మారెడ్డి అన్నాడు. ఇలాంటి సమస్యల గురించి మాట్లాడేందుకు ఇండస్ట్రీలో ఒక కమిట్‌ ఉంది. ఆ కమిటీ ముందు దీన్ని చర్చించి ఉంటే బాగుండేది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మొత్తానికి తమ్మారెడ్డి మాత్రమే కాకుండా ఎంతో మంది కూడా మా లో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

maa-controversy