ఏపీ అసెంబ్లి స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌గా సీతారాం ఎన్నికపై సభలో ప్రొటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ పదవికి సీతారాం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో సభాపతి ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో ఏపీ అసెంబ్లి స్పీకర్‌గా తమ్మినేని సీతారం బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్ స్థానం వరకు తమ్మినేని సీతారం వెంట సీఎం జగన్‌తో పాటు టీడీపీ తరపున అచ్చెన్నాయుడు వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారాంను సీఎం జగన్‌తో పాటు మంత్రులు, సభ్యులు అభినందనలు తెలిపారు. తమ్మినేని సీతారాం ఆముదాలవలస నుంచి ఆరుసార్లు గెలిచారు. మూడుసార్లు మంత్రిగా పని చేశారు. స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపే కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే చట్టసభలపై అవగాహన ఉన్న వ్యక్తిని స్పీకర్‌గా ఎన్నుకున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. చట్టసభలపై మళ్లి నమ్మకం కలిగించాలనే సీతారామ్‌ను ఎంచుకున్నామని అన్నారు. ఈ శాసనసభ దేశానికే ఆదర్శం కావాలని కోరుతున్నానన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటే తనకు, బాబుకు తేడా ఏముంటుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే టీడీపీ నుంచి ఎవరినైనా తీసుకుంటామన్నారు.