Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాచేపల్లి దారుణం నేపథ్యంలో సమాజంలో చైతన్యం పెంచేందుకు ప్రభుత్వం తలపెట్టిన ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం ర్యాలీకి గుంటూరు నగరం కదలి వచ్చింది. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు పెద్ద ఎత్తున ఆడబిడ్డకు రక్షణగా కదిలివచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు నగరంలో సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు… స్పీకర్ కోడెల ఈ ర్యాలీని ప్రారంభించారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రామకృష్ణ, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కలెక్టర్, ఎస్పీలు పాల్గొన్నారు.
కలెక్టరేట్ కూడలి నుంచి హిందూ కళాశాల వరకు ప్లకార్డులు చేతబట్టి వేలాదిమంది నిరసనలో పాల్గొన్నారు. చట్టాలకు పదును పెట్టడంతో పాటు… ఉన్న చట్టాలను సమర్థవంతంగా అధికారులు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆడబిడ్డలపై సామాజిక వివక్ష పోవాలని, అమ్మాయిలకు బాల్యం నుంచి పిరికితనం నూరిపోయరాదని తల్లిదండ్రులకు సూచించారు. ఇలాంటి దురాగతాలకు రాష్ట్రంలో చోటులేదని, దాచేపల్లి ఘటనే ఆఖరిది కావాలని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపును ప్రస్తావించిన మంత్రి పుల్లారావు… మరోమారు ఇలాంటివి జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ నెట్లో అశ్లీల దృశ్యల నియంత్రణపై కేంద్రం ప్రత్యేక చట్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. నిర్భయ చట్టం వచ్చినా… ఈ దురాగతాలు కొనసాగడంపై మంత్రులు ఆందోళన వ్యక్తంచేశారు.