Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 లో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా ? మరోసారి అధికారం నిలబెట్టుకోడానికి ఆ పార్టీ ఏ వ్యూహం రచిస్తోంది? ఈ విషయాల మీద దృష్టి పెట్టినప్పుడు కొన్ని ఆసక్తికర అంశాలు బయటికి వచ్చాయి. మొత్తం 175 స్థానాలకు గాను 47 తెలుగు దేశం కంచుకోటలు. ఆ కంచుకోటల్ని నిలబెట్టుకుని ఇంకో 41 స్థానాల్లో గెలుపు సాధిస్తే టీడీపీకి అధికారం వశం అవుతుంది. అయితే 47 స్థానాలు టీడీపీ కంచుకోటలు అని ఎలా చెప్పగలరన్న సందేహం రావచ్చు.ఆ సందేహం తీరాలంటే ఈ కింది సమాచారాన్ని ఓ సారి చూద్దాం.
టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 2014 దాకా 8 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 5 సార్లు టీడీపీ, 3 సార్లు కాంగ్రెస్ గెలుపొందాయి. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే టీడీపీ 6 సార్లు అంతకన్నా ఎక్కువ సార్లు గెలిచినవి ఆ పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. అలా టీడీపీ కి కంచుకోటలుగా మారిన నియోజకవర్గాలు ఏమిటో, ఎందుకో చూద్దాం.
తెలుగుదేశం పార్టీ పెట్టినదగ్గరనుంచి ఓడిపోని నియోజక వర్గాలు -2
1 ) కుప్పం
2 ) హిందూపురం
తెలుగు దేశం పార్టీ 7 సార్లు గెలిచినా నియోజకవర్గాలు 16
1 ) ఇచ్ఛాపురం ( 1983 , 85 ,89 ,94 , 99 ,2009 , 2014 గెలుపు )
2 ) పలాస ( సోంపేట ) ( 2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
3 ) నెల్లిమర్ల ( భోగాపురం )( 2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
4 ) విజయనగరం (2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
5 ) శృంగవరపు కోట (2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
6 ) పాయకురావు పేట (2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
7 ) కొవ్వూరు ( 1999 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
8 ) ఆచంట (2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
9 ) నర్సాపురం (2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
10 ) ఉండి (2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
11 ) గోపాల పురం (2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
12 నందిగామ ( 1989 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
13 పొన్నూరు ( 1989 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
14 శ్రీ కళహస్తి ( 2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
15 పెనుగొండ ( 1989 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
16 పతి కొండా ( 1989 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
తెలుగుదేశం పార్టీ 6 సార్లు గెలిచినా నియోజకవర్గాలు -29
1 టెక్కలి ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
2 శ్రీకాకుళం ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
3 ఎచ్చెర్ల ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
4 భీమిలి ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
5 చోడవరం ( 1989 ,1999 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
6 మాడుగుల ( 2004 , 2014 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
7 అనకాపల్లి ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
8 నర్సీపట్నం ( 1989 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
9 రంప చోడవరం ( 2009 , 2014 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
10 తుని ( 2009 , 2014 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
11 పాలకొల్లు ( 1989 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
12 తణుకు ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
13 తాడేపల్లిగూడెం ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
14 ఉంగుటూరు ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
15 దెందులూరు ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
16 చింతలపూడి ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
17 గన్నవరం ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
18 గుడివాడ ( 1989 , 2014 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
19 అవనిగడ్డ ( 1999 ,2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
20 మైలవరం ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
21 జగ్గయ్య పేట ( 1999 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
22 పెనమలూరు ( కంకిపాడు ) ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
23 వినుకొండ ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
24 ప్రత్తిపాడు ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
25 కోవూరు ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
26 సత్యవేడు ( 1999 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
27 ధర్మ వరం ( 1999 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
28 కళ్యాణ్ దుర్గ్ ( 1989 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
29 ఎమ్మినగూరు ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
- 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గెలవని నియోజకవర్గం పులివెందుల మాత్రమే …
ఈ 47 కంచుకోటాలు కాపాడుకుంటూ ఇంకో 41 లో పక్క విజయానికి ప్రణాళికలు వేసుకుంటే తెలుగుదేశం అధికారం శాశ్వతం…
ఇలాంటి కంచు కోటలు రాష్ట్రము లో ఇంకో పార్టీ కి లేవు… అదే తెలుగుదేశం పార్టీ బలం…
మరిన్ని వార్తలు: