Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిరుపతిలో భారీ వర్షం పడింది. తిరుపతితో పాటు తిరుమలలో కూడా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో తిరుపతిలో ఏర్పాటు ‘ధర్మపోరాట’ సభా వేదిక వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. వర్షంతో పాటుగా ఈదురుగాలులు వీయడంతో సభ వేదిక వద్ద రేకులు ఎగిరిపోయాయి. దీంతో సభ కోసం వస్తున్న వారిని తమ వాహనాల్లోనే ఉండాలని నేతలు సూచించారు. అంతే కాకుండా అప్పటికే సభా వేదిక మీదకి ఎక్కిన వారిని కిందకు దించారు. కొన్ని ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. కాసేపటికి వర్షం తెరిపి ఇవ్వడంతో, నిర్వాహకులు హుటాహుటిన ఏర్పాట్లను పూర్తి చేసారు.
ఈదురుగాలులతో గందరగోళ పరిస్థితులు ఏర్పడినా… తర్వాత అవి తగ్గుముఖం పట్టాయి. వాతావరణం చక్కబడటంతో నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వరుణుడు సహకరించాడని… సభ విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక కార్యక్రమానికి ముదు వర్షం పడటం సుభ సూచకంగా వారు భావిస్తున్నారు. గాలులకు సభా ప్రాంగణం ఓ పక్కకు ఒరిగిపోయింది. అకాల వర్షంతో సభా ప్రాంగణం తడిచిముద్దైంది. ప్రాంగణం సహా అన్నింటినీ పునరుద్దరించిన నేతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది సేపటి క్రితమే చంద్రబాబు వేదిక వద్దకి చేరుకోగా సభ ప్రారంభం అయ్యింది.