విజయసాయిది ఏ జెండర్ ?

TDP Leaders Responded on vijaysai Reddy comments

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వైకాపా నేత విజయ సాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని, ఆడ, మగ, నపుంసక కానీ మరో జీవి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి కార్యంలో కూడా డ్యూయల్ రోల్ పోషించే వ్యక్తి ఫోర్త్ జెండర్ అని చెప్పారు. కాలానికి తగ్గట్టు రంగులు మార్చుతూ ఏపీ ప్రజలను ఫోర్త్ జెండర్ గా చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిందే వైసీపీ అని యూ టర్న్ తీసుకున్న చంద్రబాబు, ఆ తర్వాత అవిశ్వాసం పెట్టారని విజయసాయి మండిపడ్డారు. చంద్రబాబు ఓ వైపు బీజేపీతో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే మరోవైపు అవిశ్వాసం పెడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఏపీకి న్యాయం జరిగేందుకు ఏ పార్టీ అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని ఇంతకు ముందే తాము చెప్పామని టీడీపీ దొంగల పార్టీ అయినా, ద్రోహుల పార్టీ అయినా కేంద్రానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని చెప్పారు. లోక్ సభలో తమ సభ్యులు లేకపోయినా, సంఘీభావం ప్రకటిస్తామని తెలిపారు.

అయితే విజయసాయి చేసిన వ్యాఖ్యల మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. ఇంతకు ముందే విజయసాయి చంద్రబాబూని అనేక వ్యక్తిగత విమర్శలు చేశాడు. అసలు 11 కేసులలో ఏ2గా ఉన్న విజయసాయికి చంద్రబాబుని విమర్శించే హక్కు లేదని అంటున్నారు. అసలు చంద్రబాబుని అనే ముందు విజయ సాయిది ఏ జెండర్ అని వారు ప్రశ్నిస్తున్నారు.