వైఎస్ డెత్ మిస్టరీ వీడనేలేదు… ఇప్పుడు చంద్రబాబు కి !

TDP MLAs allegations BJP to plan Murder Attempt on Chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీ సీఎం చంద్రబాబు చుట్టూ బీజేపీ ఉచ్చు బిగిస్తోంది. ప్రత్యేక హోదా అంశంలో తమను విలన్ గా నిలబెట్టి ఏపీ లో తమ పార్టీ ఎదుగుదలకి అడ్దోస్తూ వీలైతే కేంద్ర స్థాయి రాజకీయాలలోకి వచ్చి బీజేపీ మోసం బయట పెడతానని చంద్రబాబు ప్రకటించడం బీజేపీకి మింగుడు పాడడం లేదు. దీంతో కమలనాధులు చంద్రబాబు టార్గెట్‌గా స్కెచ్ సిద్ధం చేస్తున్నారా? అనే అనుమానం తెలుగుదేశంలోనే బలంగా వినిపిస్తోంది. ‘మరో మూడు నెలల్లో ఎపీలో ఏమవుతుందో మీరే చూడండి’ అంటూ ఏపీ బీజేపీ ట్రబుల్ షూటర్ రామ్‌మాధవ్ చేసిన హెచ్చరిక… అనంతరం 2003 నాటి అలిపిరి అనుభవమే 2019లో చంద్రబాబు ఎదురవుతుందంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నోరు జారడం, మొన్నటికి మొన్న బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు మే 15 తర్వాత పార్టీకి షాక్ ట్రీట్మెంట్ తప్పదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త సందేహాల్ని పుట్టిస్తోందని చెప్పక తప్పదు.

అయితే నిన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడును హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని కర్నూలు జిల్లా ప్రస్తుత టీడీపీ నేతలు వైకాపా నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన ఎస్వీ మోహన రెడ్డి, కోడుమూరు మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తమ వద్ద సమాచారం ఉందంటున్నారు ఆ ఎమ్మెల్యేలు. ఫలితంగా ఇప్పుడీ విషయం మరో సారి హాట్ టాపికైంది. ఎవరు చంపుతాను అన్నారు. ఎందుకు ఆ పని చేస్తున్నారు. వాస్తవం ఏంటనే విషయంపై ఆరా తీస్తే సంచలన అంశాలు బయటకి వస్తున్నాయంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. ఒకప్పుడు వైఎస్ మరణం వెనుకున్న కారణాలని పరిశీలిస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను రెండో సారి అధికారంలోకి రాగానే స్వతంత్రంగా వ్యవహరించారు. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడైన ముఖేష్ అంబానీ ఏపీ గోదావరీ-కృష్ణ బేసిన్ లో వెలికితీసిన గ్యాస్ ను జాతీయం చేయాలని… మొదట ఏపీకే సరఫరా చేయాలని పట్టుబట్టారు.

లేకపోతే పైపులైన్లను వేయడానికి అనుమతి ఇవ్వమని రిలయన్స్ సంస్థకు హెచ్చరికలు పంపారు. అనంతరం అనూహ్యంగా హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం వెనుక ప్రమాదం ఉందా… లేక కుట్రకోణం ఉందనే విషయంపై అప్పట్లో వైఎస్ జగన్ సహా చాలా మంది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, అప్పటి ప్రధాని మన్మోహన్ ను కలిసి సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరినా స్పందించలేదు. కాలక్రమేనా ఆ కేసు క్లోజ్ కూడా అయిపోయి జగన్ అండ్ కో అలాగే మిగతా కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు ఆరోపణలుగానే మిగిలిపోయాయి. అయితే ఆయన మరణానికి ఆయన రిలయన్స్ అధినేతలతో పెట్టుకున్న వైరమే కారణం అని జగన్ పత్రిక అప్పటిలో వరుస కధనాలు ప్రకటించింది ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ బంకులు, మాల్స్ మీద దాడులు జరిగాయి.

అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా వైఎస్ తరహాలోనే కొత్త డిమాండ్ ని కేంద్రం ముందు ఉంచుతున్నారు. అదేమిటంటే తీర ప్రాంతానికి 12 నాటికల్‌ మైళ్లలోపు సముద్రగర్భంలో వెలికి తీసే ఖనిజ నిక్షేపాల ఆదాయంలో రాష్ట్రానికి వాటా ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అలా వెలికి తీసే ఖనిజ నిక్షేపాల ఆదాయంలో రాష్ట్రానికి వాటా ఇవ్వాలని గతంలో ఆర్థిక సంఘం చేసిన సిఫారసు. దీనిని కేంద్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపణ. అలాగే నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సముద్రగర్భంలో జరిగే మైనింగ్‌లో తమ రాష్ట్రానికి వాటా ఇవ్వాలని నాటి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ కోర్టులో కేసు వేయించారని కానీ ఆయన ప్రధాన మంత్రి అయ్యాక ఆ కేసును వెనక్కి తీసుకునేలా చేసి రూ.7 వేల నుంచి రూ.8 వేల కోట్లు గుజరాత్‌కు ఇప్పించారని మరి ఏపీకి ఎందుకు ఇవ్వరు? దీనిపై కేంద్రంతో పోరాడదామని బాబు నిన్న పిలుపునిచ్చారు.

ఆ పిలుపునిచ్చిన కాసేపటికే ఇలా టీడీపీ నేతలు చంద్రబాబు హత్యకి కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ‘హత్యకి కుట్ర’ అనే అంశం ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో అంతర్గత చర్చలకి దారి తీస్తోంది.  ఒక రాష్ట్ర సీఎం తమ రాష్ట్రానికి వాటా కావాలని అప్పుడు ప్రైవేట్ బాస్ లకి మెమొరాండం ఇవ్వగా ఇప్పుడు అదే రాష్ట్ర సీఎం మా రాష్ట్రానికి వాటా కావాల్సిందే అంటూ కేంద్రం మీద పోరుకి సిద్దం అయ్యాడు. అయితే మే 15 తర్వాత బీజేపీ ఏదో చేయనుందని తమ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు చెప్పినా ప్రజల్లోకి ఆ విషయం అంతగా వెళ్లకపోవడంతో ఇప్పుడు బాబు మీద జనానికి సాఫ్ట్ కార్నర్ వచ్చి బాబుకి ఏమి జరిగిన అది బెజేపీదే బాధ్యత అనిపించేలా చేసే ప్రయత్నం లేదనీ చెప్పలేము. పార్టీ వర్గాలే ఆయా ఎమ్మెల్యేలతో అలా మాట్లాడించి ఉండచ్చు. ఏది ఏమయినా బాబు భద్రత మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఏమి జరగనుందో తెలియాలంటే వేచి చూడాలి మరి.