Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెలాఖరున ఏపీ సీఎంతో భేటీ అవుతున్నారు. చాలా కాలం తర్వాత జరుగుతున్న ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఇటు చంద్రబాబు, అటు పవన్ ఇద్దరూ ఈ మీటింగ్ కోసం ఎదురుచూస్తుండటం ఇంకా విశేషంగా ఉంది. ఉద్దానం కిడ్నీ బాధితులపై ఫోకస్ చేసిన పవన్.. హార్వర్డ్ వెళ్లి మరీ పరిష్కారంపై చర్చలు జరిపి.. పక్కా ప్లానింగ్ తో వస్తున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ దెబ్బతో ఉద్దానం సమస్య పరిష్కారమైనట్లే అంటున్నారు.
అటు టీడీపీ వర్గాలు కూడా ఈ ప్రచారం నిజం కావాలని కోరుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ ని ఉద్దానం హీరోగా హైలైట్ చేసి, పక్కనపెట్టేస్తే.. ఇక దేనికా అడ్డం రాడని తమ్ముళ్లు అధినేతకు సలహాలిస్తున్నారట. పవన్ కు క్రెడిట్ వెళ్లిపోతే అసలు ఇంత కష్టపడుతున్న ప్రభుత్వం సంగతేంటని టీడీపీ క్యాడర్ ఆందోళన చెందుతుంది. ఉద్దానం, హార్వర్డ్ పేరు చెప్పి బాబు పవన్ ను బుక్ చేశారనే వాదన వినిపిస్తోంది.
ఇప్పటికే కిడ్నీ బాధితులకు నెలకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించి పవన్ ను ఫిదా చేశారు బాబు. ఇంతవరకూ ఏపీ చరిత్రలో ఏ సర్కారు కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇవ్వలేదు. ఈ దెబ్బతో పవన్ బాబుకు ఎదురుమాట్లాడటలేరని టీడీపీ భావిస్తోంది. అటు హార్వర్డ్ నుంచి కూడా ప్రతినిధుల్ని రప్పించారంటే.. ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అన్నకసితో బాబు ఉన్నట్లు కనిపిస్తోంది.
మరిన్ని వార్తలు